Share News

Bandi Sanjay: త్వరలోనే కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రి

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:10 PM

ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు విచ్చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు.

Bandi Sanjay: త్వరలోనే  కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రి

కరీంనగర్: జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు (సోమవారం) కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్‌గా మారిందని బండి సంజయ్ తెలిపారు.


ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయడంతో తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా మన్సూక్ మాండవీయ స్పందించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ అతి త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 10:13 PM