Share News

Hyderabad: ట్రాఫిక్‌జామ్‌లు, వరదనీటి నిల్వల పరిష్కారానికి కార్యాచరణ

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:46 AM

భారీ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్‌జామ్‌, వరదనీటి నిల్వలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Chief Secretary Shantikumari) అధికారులను ఆదేశించారు.

Hyderabad: ట్రాఫిక్‌జామ్‌లు, వరదనీటి నిల్వల పరిష్కారానికి కార్యాచరణ

- అధికారులకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌: భారీ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్‌జామ్‌, వరదనీటి నిల్వలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Chief Secretary Shantikumari) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి డీజీపీ రవిగుప్తా, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 134 ప్రాంతాలను ప్రమాదకర ప్రదేశాలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఇదికూడా చదవండి: Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు


ఈ ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని అధికారులను అడిగారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, ఎస్‌పీడీసీఎల్‌ తదితర శాఖలు, సంస్థల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి, ఈ వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను తనిఖీ చేయాలని, సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. నగరంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యంతో ట్యాంక్‌లను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటికే మూడు ట్యాంక్‌ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం మరింత బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలన్నారు. సైబరాబాద్‌ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు బ్రేక్‌డౌన్‌ అయితే, వాటిని వెంటనే తొలగించడానికి అదనపు క్రేన్‌లను అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు సమస్యల పరిష్కారానికి 630 మాన్‌సూన్‌ సహాయక బృందాలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని దానకిషోర్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 09:46 AM