Share News

TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Apr 03 , 2024 | 05:54 PM

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.

TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

యాదాద్రి: కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వంద రోజులల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.

మహాలక్ష్మి పేరుతో మహా మోసం చేశారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారెంటీలను అమలు చేసేలా పోరాడుతామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించడానికి బయలుదేరగానే రేవంత్ భయపడి కాల్వలోకి నీళ్లు వదిలేలా అధికారులను ఆదేశించారని చెప్పారు.


కాంగ్రెస్‌కి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు లేరని.. అందుకనే తమ పార్టీ నుంచి బలవంతంగా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల తర్వాత కరెంట్ బిల్లు పెంచుతారని...అన్ని రకాల ఛార్జీలు పెరుగుతాయన్నారు. బీజేపీ పాలనలో అన్ని ధరలు పెంచారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు అయోధ్య రామాలయం కట్టి , అక్షింతలు పంచి రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాముడు అందరికీ దేవుడని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు.

Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం


తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్య, పట్నం సునీత , రంజిత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమవుతారని అన్నారు. ఈ యాసంగిలో రైతుల ధాన్యాన్ని క్వింట రూ. 2500కు ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉన్నత కాలం బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు. ఈ కష్టకాలంలో తమ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఏ నాయకులను వదిలిపెట్టమని.. కేసీఆర్ కాళ్లు పట్టుకున్న మళ్లీ పార్టీలోకి రానివ్వబోమని హరీష్‌రావు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

TG Politics: రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలనుకుంటున్నారు... మంత్రి ఉత్తమ్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 03 , 2024 | 06:25 PM