Share News

Hanumantha Rao: మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:31 PM

బీజేపీ (BJP) మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత వీ. హనుమంతరావు(Hanumantha Rao) అన్నారు. ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ విద్వేషంతో రాజకీయం చేస్తుంటే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమతో రాజకీయం చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు జనాభాలో ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

Hanumantha Rao: మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీ

ఢిల్లీ: బీజేపీ (BJP) మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత వీ. హనుమంతరావు (Hanumantha Rao) అన్నారు. ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ విద్వేషంతో రాజకీయం చేస్తుంటే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమతో రాజకీయం చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు జనాభాలో ఎక్కువగా ఉన్నాయని అన్నారు.


KTR: జనజాతర కాదు.. హామీల పాతర సభ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీరామారావు

అందుకే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. అలాగే రిజర్వేషన్లపై ఉన్న గరిష్ట పరిమితి సీలింగ్ ఎత్తేస్తామని అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రక్తంలోనే పేదల గురించి ఆలోచించే గుణం ఉందని తెలిపారు. సోనియా గాంధీకి రెండు సార్లు అవకాశం వచ్చినా ప్రధాని పదవి తీసుకోలేదని చెప్పారు. రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా పార్టీ అధ్యక్ష పదవి తీసుకోలేదన్నారు.


By Election: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక చర్చలు

పేదవాడికి ఆత్మ గౌరవం ఉండేలా మేనిఫెస్టో తయారు చేశారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, బడుగు, బలహీనవర్గాలు రాహుల్ గాంధీకి ఓటేసి ప్రధానిని చేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


MP Laxman: కాంగ్రెస్‌వన్నీ బూటకపు హామీలు.. ప్రజలను నట్టెట ముంచారన్న లక్ష్మణ్

మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జై శ్రీరామ్ పేరుతో బీజేపీ ఓట్లు గండికొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీలో ఇందిర, రాజీవ్ గాంధీలు కనిపించారని చెప్పారు. రాహుల్ గాంధీతోనే నిజమైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం జరుగుతుందని వీ. హనుమంతరావు అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 07 , 2024 | 11:14 PM