Share News

By Election: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక చర్చలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:47 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో భేటీ అయ్యారు. వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై వారితో ఈ సందర్భంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులను ఎంపిక చేసి వారి పేర్లు.. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారని సమాచారం.

By Election: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక చర్చలు

మెదక్, ఏప్రిల్ 07: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో భేటీ అయ్యారు. వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై వారితో ఈ సందర్భంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులను ఎంపిక చేసి వారి పేర్లు.. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారని సమాచారం. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

అయితే ఇటీవల వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును కేసీఆర్ ప్రకటించారు. కానీ అంతలోనే కడియం శ్రీహరితోపాటు కావ్య... హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం తాను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడం లేదంటూ.. కేసీఆర్‌కు కావ్యా లేఖ రాశారు.


అంతే కాకుండా తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కారు పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలను ఆ లేఖలో కేసీఆర్‌కు కావ్య వివరించారు. ఆ కొద్ది రోజులకే కావ్య కాంగ్రెస్ పార్టీలో ఇలా చేరి.. అలా వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి లోక్‌సభ అభ్యర్థి ఎంపిక కోసం కేసీఆర్ అండ్ కో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

AP Elections: టీడీపీపై జగన్ పార్టీ ఫేక్ ప్రచారం

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా జి నందిత లాస్య గెలుపొందారు. కానీ ఆమె ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక చేసేందుకు చర్చిస్తున్నారు.

KTR: జనజాతర కాదు.. హామీల పాతర సభ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీరామారావు

ఇక గత ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెలకు కేటాయించారు. కానీ ఆమె ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

Updated Date - Apr 07 , 2024 | 08:53 PM