Share News

Gone Prakash Rao: సీఎం రేవంత్‌ని కలిసి ఆ నేతలపై ఫిర్యాదు చేస్తా

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:49 PM

బొమ్మరాశి పేటలో కొందరు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఆరోపించారు. బొమ్మరాశి పేట, శామీర్ పేట మండలంలో 920 ఎకరాల భూముల కుంభకోణం జరిగిందని చెప్పారు. బొమ్మరాశి పేటలో బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు.

Gone Prakash Rao: సీఎం రేవంత్‌ని కలిసి ఆ నేతలపై ఫిర్యాదు చేస్తా

హైదరాబాద్: బొమ్మరాశి పేటలో కొందరు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఆరోపించారు. బొమ్మరాశి పేట, శామీర్ పేట మండలంలో 920 ఎకరాల భూముల కుంభకోణం జరిగిందని చెప్పారు. బొమ్మరాశి పేటలో బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములు, ఫాం హౌజ్‌లు ఉన్నాయన్నారు. సర్వే నంబర్ 323నుంచి408 వరకు ఉన్న 1049 ఎకరాల భూములకు మీర్ రెహ్మత్ ఆలీతో పాటు మరో 6 మంది హక్కుదారులు అని చెప్పారు. ఈ భూమిని హక్కుదారుల నుంచి 1965లో మాజీ ఎంపీ బలరామకృష్ణ కొన్నారని తెలిపారు. బలరామకృష్ణ తన వారసుడు అమరేంద్ర బాబుతో పాటు మరో 20మంది పైన భూమిని రిజిస్టర్ చేశారని చెప్పారు. వీరంతా వివిధ కారణాల రీత్యా విదేశాల్లో స్థిరపడ్డారని.. దీంతో కొందరు ఈ భూములపై కన్నేశారని మండిపడ్డారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలని చెప్పారు. నిజమైన హక్కుదారుల రికార్లను మాయం చేసి.. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని ధ్వజమెత్తారు. ఈ భూమిని ఆక్రమించిన వారిలో కొంతమంది అధికారులు ఉన్నారని.. వీరందరూ తెలంగాణ హై కోర్ట్‌ను కూడా తప్పుదోవ పట్టించారని చెప్పారు. కోర్ట్‌లో కూడా కేసు నడుస్తుందని... కోర్ట్‌కు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారని చెప్పారు. అసలైన హక్కుదారులను తీసుకొచ్చి నిజమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామని అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కలిసి ఈ భూములు ఆక్రమించిన నేతలపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సీఎంకు అన్ని విషయాలు చెబుతానని ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదన్నారు. ధరణిలో లొసుగులు ఉన్నాయని రేవంత్ ధరణీ కమిటీ వేశారని చెప్పారు. రైతు సంఘాల పేరుతో బొమ్మరాశిపేటలో కొందరు వందల ఎకరాల భూములు కొన్నారన్నారు. ఈనెల14వ తేదీన బొమ్మరాశి పేటకు ధరణీ కమిటీ వెళ్లిందని చెప్పారు. బొమ్మరాశి పేట రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. ధరణీ కమిటీ దొంగ రైతు సంఘాల నాయకుల దగ్గరకు వెళ్లిందన్నారు. రైతు సంఘ అధ్యక్షుడు రామయ్య మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితుడని.. ఆయన దగ్గరికి కమిటీ వెళ్లిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ధరణీ కమిటీ అవగాహన రాహిత్యంతో మాట్లాడిందని చెప్పారు. దొంగలు ఇచ్చిన సమాచారంతో ధరణీ సభ్యులు మాట్లాడవద్దని సూచించారు. ఈ భూముల విషయంపై కోదండ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడాలని చెప్పారు. ధరణీ కమిటీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ధరణీ కమిటీకి ఛాలెంజ్ చేస్తున్నానని పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక అందరం రైతుల దగ్గరికి వెళ్దామని చెప్పారు.ఎవరు ఊహించనంతగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఈ విషయాన్ని త్వరగా పరిష్కారించాలని కోరారు. కక్ష సాధింపులకు పోకుండా రేవంత్ పని చేస్తున్నారని గోనే ప్రకాశ్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 04:52 PM