Share News

Bhadradri: రాములోరి కళ్యాణానికి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈసారి కష్టమేగా!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:09 PM

Telangana: శ్రీ సీతారాముల కళ్యాణం.. కమనీయం. ప్రతీఏటా భద్రాచంలో శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు. ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూసేందుకు వీలుకాని వారు.. లైవ్ టెలికాస్ట్‌ ద్వారా కోట్లాది మంది భక్తులు టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. శ్రీసీతారాముల కళ్యాణాన్ని చూస్తూ భక్తులు పరవశించిపోతుంటారు.

Bhadradri: రాములోరి కళ్యాణానికి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఈసారి కష్టమేగా!
Bhadradri Sri Sitaramula kalyanam

భద్రాద్రి, ఏప్రిల్ 16: శ్రీ సీతారాముల కళ్యాణం.. కమనీయం. ప్రతీఏటా భద్రాచంలో (Bhadrachalam Temple) శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివస్తుంటారు. ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూసేందుకు వీలుకాని భక్తులు.. లైవ్ టెలికాస్ట్‌ ద్వారా టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. కోట్లాది మంది భక్తులు టీవీల్లో శ్రీసీతారాముల కళ్యాణాన్ని చూస్తూ పరవశించిపోతుంటారు. అయితే ఈసారి మాత్రం భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని టీవీలో చూసే అదృష్టం లేనట్టే కనిపిస్తోంది. అందుకు త్వరలో జరుగనున్న ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. తెలంగాణలో మే 13న పార్లమెంట్‌ ఎన్నికలు (loksabha Election 2024) జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

Big Breaking: జనసేన ఊపిరిపీల్చుకో.. హైకోర్టు గుడ్ న్యూస్!


భద్రాద్రికి సీఎం వెళ్తారా?.. లేదా?..

ఈ క్రమంలో భద్రాద్రి రాముడి కళ్యాణానికి ఎన్నికల కోడ్ (Election Code) ఎఫెక్ట్ పడింది. రామయ్య కళ్యాణం లైవ్ టెలికాస్ట్‌పై ఎన్నికల సంఘం (Election Commission) ఆంక్షలు విధించింది. రాములోరి కళ్యాణ కార్యక్రమానికి లైవ్ టెలికాస్ట్‌కు (Live Telecast) అనుమతి ఇవ్వాలని ఈసీని దేవాదాయ శాఖ కోరింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్‌కు దేవదాయ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వలేమని ఈసీ తేల్చిచెప్పేసింది. గత 40 ఏళ్లుగా ప్రతీ ఏటా లైవ్ టెలికాస్టు అవుతుందని ఈసీకి ప్రభుత్వం (Telangana Government) రిక్వెస్ట్ పెట్టింది. లైవ్ టెలికాస్ట్‌ను కోట్లాది మంది ప్రజలు చూస్తారని ఎన్నికల సంఘానికి దేవాదాయ శాఖ లేఖ రాసింది.

CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు


ప్రతి ఏటా సీఎం చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మొదటి సారి ఎన్నికల ఎఫెక్ట్‌తో సీఎం వెళ్తారా?.. లేదా? అన్నదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి సీఎస్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు భద్రాచలం రాముడి కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో రామయ్య కళ్యాణాన్ని లైవ్‌ టెలికాస్ట్‌లో చూసేందుకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మరోసారి ఈసీకి దేవాదాయ శాఖ లేఖ రాసింది.


ఇవి కూడా చదవండి...

TS News: స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 01:12 PM