Share News

Loksabha Polls 2024: రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ..

ABN , Publish Date - May 04 , 2024 | 04:19 PM

Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్‌ శ్రేణులు షెడ్యూల్‌ను రూపొందించింది.

Loksabha Polls 2024: రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ..
Congress Leader Rahul Gandhi

హైదరాబాద్, మే 4: తెలంగాణలో (Telangana) లోక్‌సభ ఎన్నికలకు (Lok sabha Elections 2024) మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ (Congress) అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలు (Priyanka Gandhi) తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్‌ షెడ్యూల్‌ను రూపొందించింది.

AP Elections: అవేం సమాధానాలు జగన్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు..


రేపు (ఆదివారం) రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో రాహుల్ సభ ఉండనుంది. అలాగే ఎన్నికలకు నాలుగు రోజుల ముందు మరోసారి రాహుల్ తెలంగాణకు రానున్నారు. ఈనెల 9న రాహుల్ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 9వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు.

AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..


ప్రియాంక గాంధీ షెడ్యూల్‌లో మార్పు

మరోవైపు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ప్రియాంక ప్రచార షెడ్యూల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 6న సాయంత్రం ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. 7న ఉదయం 11 గంటలకు కామారెడ్డి సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్‌పల్లిలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అలాగే 8న భువనగిరి లేదా వరంగల్‌లో నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ఇరువురు అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 04:32 PM