Share News

Breaking: సీఎం రేవంత్ భద్రతా సిబ్బంది మార్పు, ఎందుకంటే..?

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:57 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ప్రకటించింది.

 Breaking: సీఎం రేవంత్ భద్రతా సిబ్బంది మార్పు, ఎందుకంటే..?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిలో కొందరు గతంలో కేసీఆర్ వద్ద పనిచేశారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు తెలిసింది. పాత వారిని మార్చి కొత్త భద్రతా సిబ్బందిని నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరిగిందని అధికారులు ఆరా తీశారు. కేసీఆర్ వద్ద పనిచేసిన వారి నుంచి సమాచారం బయటకు వెళుతుందని గ్రహించారు. సీఎం రేవంత్ వెంట ఉండే పోలీసు సిబ్బందిని మార్చారు. సీఎం రేవంత్ ఇంటి వద్ద సెక్యూరిటీని ఛేంజ్ చేశారు. దావోస్ పర్యటన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దే ఉంటున్నారు. భద్రతా సిబ్బంది గురించి అధికారులతో చర్చించారని తెలుస్తోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వస్తారని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 01:24 PM