Share News

NIMS: నిమ్స్‌ వైద్యులను ప్రశంసించిన సీఎం..

ABN , Publish Date - May 27 , 2024 | 04:03 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమ్స్‌ వైద్యులను ప్రశంసించారు. సోది నంద అనే ఆదివాసి యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని నిమ్స్‌ కార్డియోథోరాసిక్‌ వైద్యు లు తొలగించిన విషయం విదితమే.

NIMS: నిమ్స్‌ వైద్యులను ప్రశంసించిన సీఎం..

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమ్స్‌ వైద్యులను ప్రశంసించారు. సోది నంద అనే ఆదివాసి యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని నిమ్స్‌ కార్డియోథోరాసిక్‌ వైద్యు లు తొలగించిన విషయం విదితమే. ప్రాణాపాయ స్థితిలోని ఆ యువకుడిని రక్షించినందుకు నిమ్స్‌ వైద్య బృందాన్ని రేవంత్‌ ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు. జాగ్రత్తగా అత్యంత నిపుణతతో బాణాన్ని తొలగించి నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అభినందనలు తెలుపుతూ ఈ ఘటనతో ప్రజల్లో నిమ్స్‌ దవాఖానపై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిమ్స్‌ మరిన్ని విస్తృత సేవలు అందించి పేదల దేవాలయంగా పేరు తెచ్చువాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - May 27 , 2024 | 04:03 AM