Share News

KTR: నాడు- నేడు, 20 ఏళ్ల క్రితం నాటి పిక్ షేర్ చేసిన కేటీఆర్

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:08 PM

20 ఏళ్ల క్రితం నాటి ఫొటోను ఎక్స్‌లో ట్వీట్ షేర్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకప్పుడు ఇలా ఉన్నాను.. సమయం గడచిపోతుంది అని రాసుకొచ్చారు.

 KTR: నాడు- నేడు, 20 ఏళ్ల క్రితం నాటి పిక్ షేర్ చేసిన కేటీఆర్

హైదరాబాద్: రెండు, మూడు సంవత్సరాల్లో మనుషుల్లో చాలా మార్పులు వస్తుంటాయి. 10, 20 ఏళ్లలో అయితే గుర్తుపట్టడం కష్టం. కొందరు లావు అవుతారు. మరికొందరు స్లిమ్, స్మార్ట్‌గా తయారవుతారు. 20 ఏళ్ల క్రితం నాటి ఫొటోను ఎక్స్‌లో ట్వీట్ షేర్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఒకప్పుడు ఇలా ఉన్నాను.. సమయం గడచిపోతుంది అని రాసుకొచ్చారు.

27 ఏళ్లలో ఇలా..!

ఉద్యమం పీక్ స్టేజీలో ఉన్న సమయంలో తెలంగాణకు వచ్చారు కేటీఆర్ (KTR). అప్పటి వరకు అమెరికాలో టాప్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ అక్కడే సాగింది. పాత ఫొటోలో కేటీఆర్‌కు 27 ఏళ్ల వయస్సు ఉంటాయి. ఆ ఫొటోలో వాయలెట్ కలర్ షర్ట్, టై ఉంది. దాని మీద బ్లేజర్ వేసుకొని చక్కగా కనిపించారు. నవ యువకుడిగా కనిపించారు.

తేడా ఇదే

అప్పటి ఫొటో- ఇప్పటి కేటీఆర్ ఫొటో చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నునుగు మీసాలతో ఉన్నారు. ఇప్పుడు పరిణితి చెందిన రాజకీయ నేతలా కనిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వ హయాంలో కీలకమైన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ బాధ్యతలను నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

యాక్టివ్‌గా ఉంటారు

సోషల్ మీడియాలో కేటీఆర్ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించి, లేదంటే ఇతర అంశాలను పోస్ట్ చేస్తుంటారు. అధికారంలో ఉన్న సమయంలో ఏదైనా సమస్య ట్వీట్ చేస్తే చాలు క్షణాల్లో తీర్చేవారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 01:08 PM