Share News

Big Shock to BRS: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:17 AM

బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Big Shock to BRS: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫైర్ అయ్యారు.

‘ట్యాపింగ్‌’ తేలితే కఠిన చర్యలే!

ప్రతిరోజూ సాయంత్రం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ రేవంత్ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలను లాగేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.

‘వంద’ కేంద్రంగా ప్రచారం..

ఈవీఎం, వీవీప్యాట్‌ల పరిశీలన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 08:17 AM