Share News

Congress: నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:27 AM

బీఆర్ఎస్‌కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Congress: నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS)కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్‌ (Congress)లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే (K Kesava Rao), ఆయన కూతురు జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwala Vijaya Lakshmi) చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కూతురు కడియం కావ్య (Kadiyam Kavya), ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ (Puranam Sathish) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసానికి కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్య నిలవనున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు కేకే నివాసానికి సీఎం రేవంత్, జానారెడ్డి (Janareddy) వెళ్లనున్నారు.

Pawan Kalyan: పిఠాపురంపై పవన్ ఫోకస్..

తెలంగాణలో కాంగ్రెస్‌ (Telangana Congress) మంచి జోష్ మీద ఉంది. కర్ణాటక ఫలితాల (Karnataka Results) తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ (Gandhi Bhavan) చేరికలతో కలకలలాడుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరో ఇద్దరు బిగ్ షాట్‌లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) , జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) చేరిక కూడా క్లైమాక్స్‌కు చేరుకుంది. దీంతో తెలంగాణలో సీన్ మారిపోయింది. కేవలం ఎన్నికలకు కొద్ది నెలల ముందే ప్రజానీకమంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తరువాత ప్రవేశ పెడతామన్న పథకాలన్నింటినీ ప్రవేశ పెడుతూ పార్టీ జనాలకు మరింత దగ్గరైంది. లోక్‌సభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ తెలంగాణలో మరింత గట్టిగా పాతుకుపోయింది. ఒకవైపు కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ.. బీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. కనీసం టికెట్ ఇచ్చినా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. వలసలు భారీగా పెరిగిపోయాయి.

అబద్ధాలతో ‘సిద్ధం’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 09:18 AM