Share News

TS Politics: రెండు మూడ్రోజుల్లో వస్తా.. కేసీఆర్ కీలక ప్రకటన!

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:27 PM

KCR Kadanabheri Sabha: కాళేశ్వరం, రైతులు పడుతున్న గోస, గత కొన్నిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని నేతలల వరకూ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. కరీంనగర్ వేదికగా జరిగిన ‘కదనభేరి’ భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ రియాక్ట్ అయ్యారు...

TS Politics: రెండు మూడ్రోజుల్లో వస్తా.. కేసీఆర్ కీలక ప్రకటన!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం (Keleswaram) ప్రాజెక్టు విషయంలో.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతోంది. కమిషన్లు.. కోట్లు కొట్టేయడానికే ఈ ప్రాజెక్టును కట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆఖరికి మంగళవారం నాడు జరిగిన కేబినెట్‌లో కాళేశ్వరంపై న్యాయ విచారణకు విచారణ కమిటీ నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. జస్టిస్ పినాకిని చంద్రబోస్‌ను విచారణ కమిటీ చైర్మన్‌గా నియామమించడం జరిగింది.100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కాళేశ్వరం, రైతులు పడుతున్న గోస, గత కొన్నిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని నేతలల వరకూ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. కరీంనగర్ వేదికగా జరిగిన ‘కదనభేరి’ భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ రియాక్ట్ అయ్యారు.

TS Politics: ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..



KCR-Sabha.jpg

వస్తున్నా.. వచ్చేస్తున్నా!

గత కొన్నిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య చర్చలు.. అంతకుమించి రచ్చే జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ భావించినట్లు ఉన్నారు. కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకి వచ్చి వివరిస్తానని గులాబీ బాస్ కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. మేడిగడ్డలో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి. రెండు పిల్లర్లు కుంగితే.. భూమి బద్దలైనట్లు మాట్లాడుతున్నారు. ఒక పన్ను వదులైతే మొత్తం పళ్లు రాలగొట్టుకుంటామా?. రెండు పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోందని రచ్చ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలో వస్తా.. కాళేశ్వరంపై వివరిస్తాను’ అని కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పాను. చెప్పినట్లుగానే ఇంటింటికి నీళ్లు ఇచ్చాను. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుబంధు ఆపలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఒక్క నవోదయ స్కూల్‌, మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదు. కరీంనగర్‌ అభివృద్ధికి బండి సంజయ్‌ ఏం చేశారు?. వినోద్‌కుమార్‌కు, బండి సంజయ్‌కు పోలికే లేదు. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేయించిన వ్యక్తి వినోద్‌కుమార్‌. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఒక్క ఎకరా అయినా ఎండిందా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు.


ఆగమైంది.. కన్నీళ్లొస్తున్నాయ్!

‘ పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. మూడు నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగమాగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయం అనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. మొన్న ఎన్నికల్లో నేను గెలిచి ఉంటే దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి.. అందర్నీ చైత్యన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది సరే ఓర్చుకుందాం.. తట్టుకుందాం.. ఉద్యమాలు చేసినోళ్లం.. ఓపిక ఉన్నోళ్లం. ధైర్యంగా ముందుకెళ్లాలి’ అని పార్టీ శ్రేణులకు సూచిస్తూ.. కాంగ్రెస్‌పై గులాబీ బాస్ కన్నెర్రజేశారు.

AP Politics: భీమవరంలో పోటీపై మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చిన పవన్ కల్యాణ్!


Kadana-Bheri.jpg

ప్రశ్నిస్తే తొక్కుతారా..?

అప్పట్లో తెలంగాణ వస్తుందని ఎవరూ నమ్మలేదు. నాటి పోరాటంలో కొందరు మాత్రమే నాతో కలిసివచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పండపెట్టి తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటా.. పెండ మొఖానికి రాసుకుంట.. చీరుతా, సంపుతా.. మానవ బాంబునైతా.. మట్టి బాంబునైతా అంటున్నాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు దురుసుగా మాట్లాడలేదు. మాకన్నా బాగా పనిచేయాలి.. దురుసుగా మాట్లాడొద్దు’ అని కాంగ్రెస్ సర్కార్‌కు, రేవంత్‌కు కేసీఆర్‌ సలహాలిచ్చారు. ‘BRS తెలంగాణ గళం.. తెలంగాణ బలం. పార్లమెంట్‌ ఎన్నికల్లో BRSను గెలిపించుకోవాలి. కాంగ్రెస్ నేతలు బోగస్‌ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లను 4 నెలలు పనిచేయనివ్వాలని చెప్పా. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. కేసీఆర్‌ దిగిపోగానే కరెంట్‌ బంద్‌ అయ్యింది. కాంగ్రెస్‌ సర్కార్‌ కరెంట్‌.. రైతుబంధు ఇవ్వలేకపోతోంది. ఒక్క నవోదయ స్కూలు ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి?. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు.

KCR-Warning.jpg

పోలీసులకు వార్నింగ్..!

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే మా కార్యకర్తలు, గ్రామ ప్రజలను పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దు. పోలీసులకు రాజకీయాలతో ఏం పని..?. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మామీద కూడా కుక్కలు మొరిగినయ్.. ఎవడి పాపాన వాడు పోతాడు అన్నం కానీ ఈ దౌర్జన్యాలు చేయలేదు. మేం కనుక చేయించి ఉంటే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరైనా రాష్ట్రంలో మిగిలేవారా..? అని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 09:27 PM