Share News

BJP Rathayatra: బీజేపీ ‘విజయసంకల్ప’ యాత్ర ప్రారంభం

ABN , Publish Date - Feb 20 , 2024 | 10:52 AM

Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.

BJP Rathayatra: బీజేపీ ‘విజయసంకల్ప’ యాత్ర ప్రారంభం

నిర్మల్, ఫిబ్రవరి 20: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర (BJP Vijaysankalp Yatra) ప్రారంభమైంది. ఎంపీ సోయం బాపురావు (MP Soyam Bapu Rao), ఎమ్మెల్యే రామారావు పాటిల్ (MLA Ramarao Patil).. వాహనాలకు పూజలు నిర్వహించి అనంతరం యాత్రను ప్రారంభించారు.

అలాగే.. బాసరలో అస్సోం సీఎం హేమంత బిస్వా శర్మ, యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రథయాత్రలో పాల్గొంటారు. నారాయణపేటలో కిషన్ రెడ్డి, తాండూరులో రథయాత్రలో బండి సంజయ్ పాల్గొననున్నారు. డీకే అరుణ, ఈటల, లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు రథయాత్రలో పాల్గొంటారు. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కమలం పార్టీ నేతలు కలుసుకోనున్నారు. కేంద్ర విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.


మాదే విజయం: ఎంపీ బాపురావు

అంతకుముందు ఎంపీ సోయంబాపురావు, బీజేపీ నేతలు సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని.. అది మునిగే పడవ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ నుంచి తానే పోటీలో ఉంటానని.. భారీ మెజారిటీతో గెలుస్తానని ఎంపీ సోయంబాపురావు ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 10:52 AM