Share News

Telangana: కేటీఆర్.. నీ భాష మార్చుకో.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్..

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:17 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.

Telangana: కేటీఆర్.. నీ భాష మార్చుకో.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ మీ భాష మార్చుకోండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోడు అంటావా.. కాలి గోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పెట్టాడా అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మూడో రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాలి గోటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే 50వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది.. మీలాగా పూటకో మాట చెప్పదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. కొండమడుగులో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తాం. కేసీఆర్ యాదాద్రి నుంచి ఫామ్ హౌస్ కు పోతుంటే వాసాలమర్రిలో రోడ్డుకు స్మశానవాటిక అడ్డంగా ఉందని గ్రామాన్ని దత్తత తీసుకొని వదిలేశాడ"ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం చేతకావడం లేదంటూ ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 03:17 PM