Share News

Shah Rukh Khan: కోల్‌కతా గెలుపుతో షారూఖ్ ఖాన్ రియాక్షన్స్ చుశారా..వైరల్ వీడియో

ABN , Publish Date - May 27 , 2024 | 07:59 AM

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ 17 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)ను ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో కోల్‌కతా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే పదేళ్ల తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకున్న క్రమంలో ఈ జట్టు యజమాని షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) చాలా సంతోషంగా కనిపించారు.

Shah Rukh Khan: కోల్‌కతా గెలుపుతో షారూఖ్ ఖాన్ రియాక్షన్స్ చుశారా..వైరల్ వీడియో
Shah Rukh Khan reactions kkr won

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ 17 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)ను ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో కోల్‌కతా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే పదేళ్ల తర్వాత కోల్‌కతా ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకున్న క్రమంలో ఈ జట్టు యజమాని షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) చాలా సంతోషంగా కనిపించారు. జట్టును అభినందించేందుకు మైదానంలోకి రావడమే కాదు, కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు.


అదే సమయంలో తన కుమార్తె(daughter) సుహానా ఖాన్(Suhana khan) చాలా ఎమోషనల్‌గా కనిపించారు. ఆ క్రమంలో మీరు సంతోషంగా ఉన్నారా అని తండ్రిని అడుగుతుంది. దీనికి షారూఖ్ తల ఊపుతూ సమాధానమిచ్చి ఆపై తన కుమార్తెను కౌగిలించుకున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానని సుహానా చెప్పింది. ఆ తర్వాత అబ్రామ్, ఆర్యన్ ఖాన్ కూడా వచ్చి షారూఖ్‍‌ను హత్తుకున్నారు.

ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(viral video) అవుతోంది. షారూఖ్ తన భార్య గౌరీ ఖాన్‌ను(gauri khan) కౌగిలించుకుని, ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో కూడా అంతకంతకూ వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేయకుండా అభిమానులు ఉండలేకపోతున్నారు.


ఇది కూడా చదవండి:

Kaviya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్

IPL 2024: ఐపీఎల్ 2024లో గెలిచిన.. ఓడిన జట్లకు ఎంత మనీ వస్తుంది..?

Read Latest Business News and Telugu News

Updated Date - May 27 , 2024 | 08:04 AM