Share News

Kavya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్

ABN , Publish Date - May 27 , 2024 | 06:42 AM

ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది. దీంతో జట్టు ఓనర్‌ కావ్య మారన్‌(Kavya Maran) కన్నీరు పెట్టుకున్నారు.

Kavya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్
Kaviya Maran tears srh lost

ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే హైదరాబాద్‌ జట్టు పరాజయం తర్వాత జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కన్నీరు పెట్టుకున్నారు. గెలవాలనుకున్న మ్యాచ్ ఓడిన క్రమంలో కావ్య తన కన్నీటిని ఆపుకోలేకపోయారు.


హైదరాబాద్ ఓటమి తర్వాత కావ్య మారన్ జట్టును ప్రోత్సహించినా ఆమె కళ్లలో మాత్రం నీళ్లు తిరిగాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె చప్పట్లు కొడుతూ వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆమె ముందు వైపు తిరిగి, జట్టును ప్రోత్సహించడం కనిపిస్తుంది.


ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా, గౌతమ్ గంభీర్ మెంటర్‌గా ఉన్న KKR జట్టు IPL 2024 ఫైనల్‌లో 2016 ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన కోల్‌కతా ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్‌ను 18.3 ఓవర్లలో 113 పరుగుల అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసింది. ఆపై 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకోవడం విశేషం.


ఇది కూడా చదవండి:

IPL 2024: ఐపీఎల్ 2024లో గెలిచిన.. ఓడిన జట్లకు ఎంత మనీ వస్తుంది..?

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Read Latest Business News and Telugu News

Updated Date - May 27 , 2024 | 01:05 PM