Share News

Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:28 AM

టీ 20 వరల్డ్ కప్‌ సిరీస్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టంచేశారు.

Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ

టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా సారథి ఎవరు..? ఈ ప్రశ్న పదే పదే వస్తోంది. వాస్తవానికి టీమిండియా టీ 20 ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ (BCCI) నియమించింది. 2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి టీ 20 వరల్డ్ కప్‌లో అవకాశం ఇవ్వాలనే అభిమానులు కోరారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ఏడవడం క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేసింది. టీ 20లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. అందుకు అనుగుణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

కెప్టెన్‌గా రోహిత్

టీ 20 వరల్డ్ కప్ అమెరికా, కరేబియన్‌లో ఈ ఏడాది జరగనుంది. ఆ సిరీస్‌ కోసం సీనియర్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులోకి వస్తారు. జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తారని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ‘వరల్డ్ కప్‌లో టీమిండియా వరసగా 10 విజయాలు సాధించింది. ప్రపంచ కప్ మాత్రమే గెలవలేదు. అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ బార్బడోస్‌లో జరగనుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తారు. అక్కమ మేమంతా మువ్వన్నెల జెండా పట్టుకొని ఉంటాం అని’ జై షా స్పష్టం చేశారు. టీ 20 వరల్డ్ కప్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మాజీ క్రికెట్ నిర్వాహకులు, మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టామని జై షా వివరించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 08:29 AM