Share News

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:55 AM

భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో (IPL) మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం (12/04/24) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల 191 రోజు వయసులో 3వేల పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. దీంతో.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (Virat Kohli) (26 ఏళ్ల 186 రోజులు) తర్వాతి స్థానాన్ని రిషభ్ సొంతం చేసుకున్నాడు.

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?


ఇదే సమయంలో.. యూసుఫ్ పఠాన్ (Yousuf Pathan) రికార్డ్‌ని కూడా పంత్ బద్దలుకొట్టాడు. 3 వేల పరుగులు చేసేందుకు పంత్ 2028 బంతులు ఎదుర్కోగా.. పఠాన్ 2082 బంతులు, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 2130 బంతులు ఆడాల్సి వచ్చింది. కేవలం పరుగుల పరంగానే కాదు.. స్ట్రైక్-రేట్ విషయంలోనూ రిషభ్ చారిత్రాత్మక రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో మొత్తం 25 మంది బ్యాటర్లు 3వేల పరుగుల స్కోర్ చేయగా.. వీరిలో స్ట్రైక్-రేట్ పరంగా ఏబీ డీ విలియర్స్ (AB De Villiers) (151.68), క్రిస్ గేల్ (Chris Gayle) (148.96)ల తర్వాత రిషభ్ (148.4) మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా.. లక్నోతో మ్యాచ్‌తో 160కి పైగా స్కోరుని ఛేధించిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్, ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా పంత్ చరిత్రపుటలకెక్కాడు.

Children Bank Of India: నకిలీ నోట్ల దందా.. అడ్డంగా పట్టించిన ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. బదోని (55) అర్థశతకంతో రాణించడం, కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) మెరుపులు మెరిపించడంతో.. లక్నో జట్టు అంత స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. జేక్ ఫ్రెజర్ (55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రిషభ్ (41), పృథ్వీ షా (32) మెరుపులు మెరిపించడంతో.. ఢిల్లీ జట్టు సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేధించగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 11:01 AM