Share News

WPL 2024: డబ్ల్యూపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లను ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలంటే..

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:41 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.

WPL 2024: డబ్ల్యూపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లను ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలంటే..

ఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో జరిగిన పోటీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరిన జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం తుది పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడే ముంబై, బెంగళూరు జట్లు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై, స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టుమధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం చివరి వరకు ఉత్కంఠ తప్పకపోవచ్చు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్‌లను ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చూడాలనే అనుమానాలు పలువురు క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి.


మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ మొత్తాన్ని స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దీంతో టీవీల్లో మ్యాచ్ చూడాలనుకునేవారు స్పోర్ట్స్ 18లో చూసేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి చార్జ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మొబైల్ ఫోన్లలో అయితే జియో సినిమా యాప్‌లో చూడొచ్చు. దీనికి కూడా ప్రత్యేకంగా ఎలాంటి చార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర జియో సిమ్ ఉండి, అది రిచార్జ్ చేసి ఉంటే సరిపోతుంది. అయితే ఇది భారతదేశంలోని వారికి మాత్రమే. డబ్ల్యూపీఎల్‌లో రాత్రి జరిగే మ్యాచ్‌లన్నీ 7.30 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా అదే సమయానికి ప్రారంభంకానున్నాయి. అరగంట ముందుగా అంటే 7 గంటలకే టాస్ వేయనున్నారు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 03:42 PM