Share News

T20 World Cup 2024: మ్యాచ్‌లలో భారత్-పాక్ మ్యాచ్ వేరయా.. టికెట్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:02 PM

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.

T20 World Cup 2024: మ్యాచ్‌లలో భారత్-పాక్ మ్యాచ్ వేరయా.. టికెట్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
T20 World Cup 2024

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ అభిమానులు సైతం టికెట్లు కొనుగోలు చేయడానికి వీలు లభిస్తోంది. ఈ విండో ఫిబ్రవరి 7తో ముగుస్తుంది.

టీ20 వరల్డ్ కప్ టికెట్ల ధర ఎంత?

జూన్ 2వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌లు జరగునున్నాయి. మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనుండగా గ్రూప్ స్టేజ్, సూపర్ -8, సెమీ ఫైనల్స్ కోసం 2.60 లక్షల టికెట్లను విడుదల చేశారు. టికెట్ల ధరల విషయానికి వస్తే ఒక్కో కేటరిగిరీ టికెట్ ధర ఒక్కోలా ఉంది.

ఐసీసీ జారీ చేసిన టికెట్లలో అత్యల్పంగా 6 డాలర్లు(రూ.500) ఉంది. అత్యధికంగా 25 డాలర్లు(రూ.2071)గా ఉంది. టికెట్ల కోసం t20worldcup.com వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఐడీ నుంచి ఒక మ్యాచ్‌లో గరిష్ఠంగా 6 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా వేర్వేరు మ్యాచ్‌లకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. 6 డాలర్ల నుంచి 25 డాలర్ల ధరతో 2,60,000 టికెట్లను మాత్రమే ఓపెన్ సేల్‌ కింద పెట్టింది.

భారత్-పాక్ మ్యాచ్‌‌కు ఫుల్ డిమాండ్..

ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉంది. దీంతో సాధారణ ధరలో టికెట్లు దొరికే పరిస్థితి లేదు. అందుకే.. భారత్-పాక్ మ్యాచ్ చూడాలంటే అభిమానులు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ప్రీమియం కేటగిరీ టికెట్ ధర 175 డాలర్లు ఉంది. ఇది ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 14,450, స్టాండర్డ్ ప్లస్ కోసం రూ. 25,000 ధర ఉంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ టిక్కెట్ ధర రూ.33000 పలుకుతోంది. ఇది అత్యధికం అని చెబుతున్నారు.

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ఆసక్తి..

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. వాస్తవానికి భారత జట్టు పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్ A లో ఉంది. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ టీ20 ప్రపంచకప్‌‌లో తొలి అడుగు వేయనుంది. అయితే, జూన్ 9న భారత్-పాక్ జట్ల మధ్య జరిగే గ్రేట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఈ హైవోల్టేజీ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జరగనుంది.

Updated Date - Feb 02 , 2024 | 03:07 PM