Share News

SRH vs MI: ముంబై దిగ్గజ బౌలర్ రికార్డుపై భువనేశ్వర్ కన్ను.. మరొక వికెట్ తీస్తే..

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:32 PM

ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

SRH vs MI: ముంబై దిగ్గజ బౌలర్ రికార్డుపై భువనేశ్వర్ కన్ను.. మరొక వికెట్ తీస్తే..

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్లు తమ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో బోణీ చేయడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఓ రికార్డును చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.


ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ(Lasith Malinga) రికార్డును బద్దలుకొడతాడు. వీరిద్దరు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 170 వికెట్ల చొప్పున తీశారు. దీంతో మరొక వికెట్ తీస్తే మలింగను భువి అధిగమిస్తాడు. మలింగ 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ 161 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు. ఇక జాబితాలో 183 వికెట్లు తీసిన బ్రావో మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో బ్రావో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎక్కువగా చెన్నై తరఫున ఆడాడు. అలాగే ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌తో భువనేశ్వర్ చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన పేస్ బౌలర్‌గా నిలవనున్నాడు. ఈ క్రమంలో మాజీ బౌలర్ బ్రావో రికార్డును అధిగమించనున్నాడు. భువి, బ్రావో ఇప్పటివరకు 161 మ్యాచ్‌ల చొప్పున ఆడారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మాక్రమ్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ , జయదేవ్ ఉనద్కత్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, ఫజల్హాక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్, ఝటావేద్ సుబ్రమణ్యన్, సంవీర్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, నితీష్ రెడ్డి

ముంబై ఇండియన్స్ జట్టు

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్, నమన్ ధీర్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, శివాలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, క్వేనా మఫాకా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా

SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ



Updated Date - Mar 27 , 2024 | 04:33 PM