Share News

SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా

ABN , Publish Date - Mar 27 , 2024 | 03:45 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.

SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) జట్లు బుధవారం తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా ముంబై ఇండియన్స్ దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ (Lasith Malinga) రికార్డును జస్ప్రీత్ బుమ్రా సమం చేయనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన పేసర్‌గా మలింగతో కలిసి మొదటి స్థానానికి చేరుకుంటాడు. కాగా మలింగ 122 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ముంబై తరఫున 121 మ్యాచ్‌లాడిన బుమ్రా బుధవారం నాటి మ్యాచ్‌తో మలింగను సమం చేయనున్నాడు. ఇక 122 మ్యాచ్‌ల్లో మలింగ 170 వికెట్లు తీశాడు. 121 మ్యాచ్‌ల్లో బుమ్రా 148 వికెట్లు తీశాడు. కాగా వీరిద్దరు తమ ఐపీఎల్ కెరీర్ మొత్తం ముంబై తరఫునే ఆడడం గమనార్హం. అలాగే ఇదే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు తమ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లు కూడా తమ ఆరంభ మ్యాచ్‌ల్లో చేజ్ చేస్తూ స్వల్ప తేడాతో ఓడిపోయాయి. గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై 6 పరుగుల తేడాతో ఓడిపోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నీ అతిథ్య జట్లే గెలిచాయి. ఇది సన్‌రైజర్స్‌కు సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ

Virat Kohli: టీ20 గేమ్ ప్రమోషన్‌కు నా పేరే వాడుతున్నారు.. వారికి కోహ్లీ సూపర్ అన్సర్



Updated Date - Mar 27 , 2024 | 03:45 PM