Share News

Shreyas Iyer: సన్‌రైజర్స్‌పై శ్రేయస్ సెటైర్.. ఇలా అనేశాడేంటి?

ABN , Publish Date - May 27 , 2024 | 10:22 AM

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఎన్నో ట్విస్టులు, మలుపులు, గుర్తుండిపోయే అద్భుత ఇన్నింగ్స్‌లతో సాగిన ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన..

Shreyas Iyer: సన్‌రైజర్స్‌పై శ్రేయస్ సెటైర్.. ఇలా అనేశాడేంటి?

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ముగిసింది. ఎన్నో ట్విస్టులు, మలుపులు, గుర్తుండిపోయే అద్భుత ఇన్నింగ్స్‌లతో సాగిన ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఛాంపియన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్‌తో (SRH) జరిగిన తుది పోరులో ఘనవిజయం సాధించింది. టోర్నీ ప్రారంభం నుంచి నిలకడగా రాణించిన కేకేఆర్ ప్లేయర్లు.. ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ప్రతిభ చాటారు. తమ జట్టుని ఛాంపియన్‌గా నిలపడంలో అందరూ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు విజయం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించిన అతను.. సన్‌రైజర్స్‌పై ఓ సెటైర్ కూడా వేశాడు.


ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సమయంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘జట్టుగా మేము సమిష్టిగా రాణించి టైటిల్ సాధించాలని అనుకున్నాం. కీలక సమయంలో ప్రతిఒక్కరూ తమదైన ప్రతిభ చాటారు. ఈ సీజన్ మొత్తంలో అందరూ అద్భుత ఆటతీరుని ప్రదర్శించారు. అందుకే.. ఫైనల్‌లో నెగ్గగలిగాం. ఈ సమయం కోసం చాలాకాలం నుంచి వేచి చూస్తున్నా. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఫైనల్ మ్యాచ్‌లో మాకు బౌలింగ్ చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. చివరి వరకూ మ్యాచ్‌ని మా చేతుల్లోనే ఉంచుకోగలిగాం’’ అని చెప్పుకొచ్చాడు. అంటే.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంపిక చేసుకొని, తమకు మంచి ప్రయోజనమే చేకూర్చారని శ్రేయస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు. నిజానికి.. ఈ ఫైనల్ మ్యాచ్ భారీ ఒత్తిడి కలిగినదని, కానీ ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించడంతో సునాయాసంగా గెలవగలిగామని పేర్కొన్నాడు.

టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?

అటు.. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా కేకేఆర్ జట్టు ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా.. కోల్‌కతా బౌలర్లను మెచ్చుకున్నాడు. తన సహచరుడు స్టార్క్ మరోసారి విజృంభించాడని, మిగిలిన బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. ఒకవేళ తాము 160కి పైగా స్కోరు చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో తమ సన్‌రైజర్స్ కుర్రాళ్లు అదరగొట్టేశారని.. మూడుసార్లు 250+ స్కోర్లు సాధించామని అన్నాడు. ఇలాంటి భారీ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ప్రతి ఏటా ఈ లీగ్ మరింత మెరుగ్గా జరుగుతోందని పాట్ కమిన్స్ పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 27 , 2024 | 10:22 AM