Share News

Gautam Gambhir: టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?

ABN , Publish Date - May 27 , 2024 | 08:47 AM

భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను..

Gautam Gambhir: టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?

భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ (BCCI) తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే.. రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంబీర్‌లతో పాటు ఇతర దిగ్గజ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే.. వారిలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పేరే ఎక్కువగా మార్మోగిపోతోంది. అతనిని హెడ్ కోచ్‌గా నియమిస్తే.. టీమిండియా రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు.. బీసీసీఐ కూడా గంభీర్‌వైపే మొగ్గుచూపుతోందని సమాచారం.


ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?

ఇలాంటి తరుణంలో.. తాజాగా ఓ ఆసక్తికరమైన పరిణామం వెలుగుచూసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) గెలుపొందిన తర్వాత.. బీసీసీఐ సెక్రటరీ జై షాతో (Jay Shah) కలిసి గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చిన వీళ్లిద్దరు.. కాసేపు మైదానంలో చర్చించుకున్నారు. వీరి సంభాషణలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) సైతం తోడయ్యారు. దీంతో.. గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా కన్ఫమ్ అవ్వడం ఖాయమని రూమర్లు ఊపందుకున్నాయి. మెంటర్‌గా కేకేఆర్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు కాబట్టి.. హెచ్ కోచ్ విషయమై గంభీర్‌తో జై షా చర్చలు జరిపి ఉండొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రధాన కోచ్‌గా గంభీర్ దరఖాస్తు చేసుకుంటాడా? లేదా? అనేది ప్రస్తుతం మిస్టరీగానే ఉండిపోయింది.

మరోవైపు.. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ ఆసక్తిగానే ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందుకు అతను బీసీసీఐకు ఓ కండీషన్ పెట్టాడని టాక్ వినిపిస్తోంది. ‘సెలక్షన్ గ్యారెంటీ’ ఇస్తేనే తాను హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తాన‌ని గంభీర్ చెప్పిన‌ట్లు ఓ నివేదిక తెలిపింది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన‌ట్లు సమాచారం. చూస్తుంటే.. ద్రవిడ్ అనంతరం హెచ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 27 , 2024 | 09:41 AM