Share News

Cricket News: సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:53 AM

Cricket News: లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడాలని యంగ్ ప్లేయర్లే కాదు.. తోపు ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. అతడితో ఆడితే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తుంటారు. అలా మాహీ గైడెన్స్‌, సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్‌తో స్టార్లుగా మారిన వాళ్లూ చాలా మందే ఉన్నారు.

Cricket News: సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ
Sameer Rizvi

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడాలని యంగ్ ప్లేయర్లే కాదు.. తోపు ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. అతడితో ఆడితే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తుంటారు. అలా మాహీ గైడెన్స్‌, సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్‌తో స్టార్లుగా మారిన వాళ్లూ చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు విధ్వంసం సృష్టించాడు. 20 సిక్సులతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఐపీఎల్‌లో మాహీ ట్రెయినింగ్‌లో హిట్టర్‌గా ఎదిగిన ఆ కుర్రాడు.. డొమెస్టిక్ క్రికెట్‌లో నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఇంతకీ ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆకాశమే హద్దుగా..

బీసీసీఐ పురుషుల అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీలో యూపీ కెప్టెన్ సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 97 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకొని అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూపించాడు. గ్రౌండ్ నలుమూలలా భారీ సిక్సులు బాదుతూ అపోజిషన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మొత్తంగా 13 ఫోర్లు, 20 సిక్సుల సాయంతో 97 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలబడ్డాడు రిజ్వీ. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో ఉత్తర్ ప్రదేశ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోరు చేసింది.


సీఎస్‌కే టు డీసీ..

యూపీ టీమ్‌లో సమీర్‌తో పాటు శౌర్య సింగ్ (51), ఆదర్శ్ సింగ్ (52) రాణించారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన త్రిపుర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఆనంద్ (68), తన్మయ్‌దాస్ (48) ఫైట్ చేసినా లాభం లేకుండా పోయింది. ఉత్తర్ ప్రదేశ్ బౌలర్లలో కునాల్ త్యాగీ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. వన్ష్ చౌదరీ, విజయ్ కుమార్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ నాక్‌తో అండర్-23 స్టేట్-ఏ హిస్టరీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా రిజ్వీ నిలిచాడు. ఇక, గత ఐపీఎల్ సీజన్ వరకు సీఎస్‌కేకు ఆడిన ఈ బ్యాటర్‌ను రూ.95 లక్షల ధర పెట్టి మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.


Also Read:

రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..

ఊతప్పపై అరెస్ట్‌ వారెంట్‌

విరాట్‌ పబ్‌కు నోటీసులు

అఫ్ఘాన్‌దే వన్డే సిరీస్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 10:53 AM