Share News

MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - May 29 , 2024 | 05:34 PM

రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ కొన్ని రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. ఇప్పుడంటే గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడనే వార్తలు బలంగా..

MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకో తెలుసా?
MS Dhoni Not Eligible To Apply For India Head Coach

రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ కొన్ని రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. ఇప్పుడంటే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) దాదాపు కన్ఫమ్ అయ్యాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి కానీ, మొదట్లో బీసీసీఐ (BCCI) ఈ పదవి కోసం దరఖాస్తులను స్వీకరించినప్పుడు కొందరు సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. అదే సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు కూడా తెరమీదకు వచ్చింది. భారత జట్టుకి ధోనీ హెడ్ కోచ్ అయితే బాగుంటుందని సీనియర్లతో పాటు క్రీడాభిమానులూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


Read Also: జూన్ నెలలో ఈ తేదీలు ఎంతో ముఖ్యమైనవి.. అవేంటంటే?

అయితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం హెడ్ కోచ్ పదవికి ఎంఎస్ ధోనీ దరఖాస్తు చేసుకునేందుకు ‘అనర్హుడు’ అని తేలింది. ఎవరైతే ఈ పదవికి దరఖాస్తు చేసుకుంటారో.. వాళ్లు అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలకాలి. కానీ ధోనీ మాత్రం.. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా.. సీఎస్కేలో ఆటగాడిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. కాబట్టి.. రూల్స్ ప్రకారం హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు. నిజానికి.. ఐపీఎల్ 2024 (IPL 2024) తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని అందరూ అనుకున్నారు. అతను ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పి.. హెడ్ కోచ్ రేసులో నిల్చుంటాడని భావించారు. కానీ.. ధోనీ మాత్రం రిటైర్‌మెంట్ ప్రకటించలేదు.

Read Also: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఖరారు.. అదొక్కటే ఆలస్యం!

ఇదిలావుండగా.. 2021లో యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఎంఎస్ ధోనీ భారత జట్టుకి మెంటార్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తూ ఆ టోర్నీలో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ పరాభావం ధోనీ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడని, అందుకే హెడ్ కోచ్ పదవిపై అతను ఆసక్తి కనబరచడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఫిట్‌నెస్ ఇబ్బందులను ధోనీ ఎదుర్కుంటున్నాడని, ఈ కారణం వల్ల కూడా ధోనీ హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని క్రీడావర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 29 , 2024 | 05:34 PM