Share News

T20I World Cup: ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించేది ఆ రోజే..

ABN , Publish Date - Mar 01 , 2024 | 07:18 PM

జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

T20I World Cup: ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించేది ఆ రోజే..

జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 17 వరకు గ్రూప్ దశ పోటీలు.. జూన్ 19 నుంచి 26 వరకు సూపర్ 8 పోటీలు జరగనున్నాయి. జూన్ 26, 27న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 29న బార్బడోస్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది. టోర్నీలో కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. అయితే ఈ టోర్నీకి సంబంధించి భారత జట్టును ఎప్పుడు ప్రకటించబోతున్నారనే వివరాలు బయటికి వస్తున్నాయి. మే 1న ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుందని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి. కాగా ఈ టోర్నీలో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. గత వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపిన మహ్మద్ షమీ అప్పటివరకు గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే అతడిని కూడా ఎంపిక చేయొచ్చు. మొత్తంగా ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 07:18 PM