Share News

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:40 PM

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు.

IND vs ENG: పటిష్ట స్థితిలో టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కన్నా టీమిండియా ఇంకా 24 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. టీమిండియాకు ఇంకా బ్యాటింగ్ బలం ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ అధిక్యం లభించే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ సాధించిన హాఫ్ సెంచరీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో 14వది.

కాగా ఓవర్‌నైట్ స్కోర్ 119/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెంచరీ సాధిస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి రోజు ఆటకు మరో 4 పరుగులు మాత్రమే జోడించి 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. జైస్వాల్‌ను జోరూట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 123 పరుగుల వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌(23)ను టామ్ హర్ట్లీ పెవిలియన్ చేర్చాడు. కొంతకాలంగా టెస్టుల్లో రాణించలేకపోతున్న గిల్ మరోసారి నిరాశపరిచాడు. దీంతో 159 పరుగులకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కలిసి నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 200 దాటింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 12:40 PM