Share News

IND vs AFG: చరిత్రకు 44 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ABN , Publish Date - Jan 11 , 2024 | 09:14 AM

Rohit sharm: గురువారం నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

IND vs AFG: చరిత్రకు 44 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

మొహాలీ: గురువారం నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. హిట్‌మ్యాన్ చివరగా 2022 నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడాడు. ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ 4 రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ మరొక 44 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే బ్యాటర్‌గా మరొక 147 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. దీంతో ఈ మార్కు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పుతాడు.


బ్యాటర్‌గా 18 సిక్సులు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ 100 సిక్సులను పూర్తి చేసుకుంటాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేస్తాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 51 మ్యాచ్‌లకుగానూ 39 గెలిచింది. ధోని కెప్టెన్సీలో టీమిండియా 72 మ్యాచ్‌లకుగానూ 42 గెలిచింది.

మొదటి టీ20కి రెండు జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్

అఫ్ఘానిస్తాన్

రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, నవీన్-ఉల్-హక్మద్ సఖ్, ఫూల్-హక్, ఎఫ్. కరీం జనత్, ఇక్రమ్ అలీఖిల్, ఫరీద్ అహ్మద్ మాలిక్, రహ్మత్ షా, గుల్బాదిన్ నైబ్

Updated Date - Jan 11 , 2024 | 09:14 AM