Share News

IND vs AFG: రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్ బ్యాటింగ్ చేయడంపై వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:55 PM

Rohit sharma: భారత్, అప్ఘానిస్థాన్ మధ్య బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం కోసం ఏకంగా రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. చివరకు రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది.

IND vs AFG: రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్ బ్యాటింగ్ చేయడంపై వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

బెంగళూరు: భారత్, అప్ఘానిస్థాన్ మధ్య బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం కోసం ఏకంగా రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. చివరకు రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ భారీ హిట్టింగ్‌కు తోడు స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అంతముందు టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా అద్భుత సెంచరీతో దుమ్ములేపాడు. కీలక సమయంలో అద్భుతంగా ఆడిన హిట్‌మ్యాన్ అభిమానులతోపాటు విశ్లేషకుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 3 సార్లు బ్యాటింగ్ చేయడం గమనార్హం. మొదట రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ టై కావడంతో ఆ తర్వాత నిర్వహించిన రెండు సూపర్ ఓవర్లలోనూ రోహిత్ బ్యాటింగ్ చేశాడు. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. రెండు సూపర్ ఓవర్లలోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.


అసలు ఏం జరిగిందంటే.. మొదటి సూపర్ ఓవర్‌లో రైటైర్ట్ హర్ట్‌గా మరో బంతి మిగిలి ఉండగానే రోహిత్ శర్మ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ రెండో సూపర్ ఓవర్‌లోనూ బ్యాటింగ్ చేశాడు. మొదటి సూపర్ ఓవర్‌లో పెవిలియన్‌కు వెళ్లిన రోహిత్ శర్మ రెండో సూపర్‌ ఓవర్‌లోనూ బ్యాటింగ్‌కు రావడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం మొదటి సూపర్ ఓవర్‌లో ఔటైనా బ్యాటర్ రెండో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అవకాశం లేదు. అంటే మొదటి సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ అయితే సెకండ్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయవచ్చు. అలా కాకుండా రిటైర్డ్ ఔట్ అయితే మాత్రం సెకండ్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అర్హత లేదు. అయితే రోహిత్ శర్మ మొదటి సూపర్ ఓవర్‌లో పెవిలియన్‌కు వెళ్లినప్పుడు అది రిటైర్డ్ హర్టా? లేదా రిటైర్డ్ ఔటా? అనే అంశంపై అంపైర్ స్పష్టత ఇవ్వలేదు. దీంతో వివాదం తలెత్తింది. నిజానికి అది రిటైర్డ్ హర్ట్. దీంతో రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్‌లోనూ బ్యాటింగ్ చేయవచ్చు. కాబట్టి రోహిత్ శర్మ ఎలాంటి తప్పుచేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 02:05 PM