Hardik Pandya: ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. హార్దిక్ విధ్వంసాన్ని చూసి తీరాల్సిందే
ABN , Publish Date - Nov 27 , 2024 | 09:27 PM
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి బ్యాట్ మంత్రదండంలా మ్యాజిక్ చేస్తోంది. మరోమారు బ్యాట్‌తో చెలరేగిపోయాడు పాండ్యా.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భీకర ఫామ్‌లో ఉన్నాడు. భారత జట్టు తరఫున అదరగొడుతున్న అతడు.. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ చెలరేగిపోతున్నాడు. తాజాగా మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు పాండ్యా. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా తమిళనాడుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాండ్యా విశ్వరూపం చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడీ టీమిండియా స్టార్.
అదేం బాదుడు సామి
తమిళనాడుతో మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 69 పరుగులు బాదేశాడు హార్దిక్. ఇందులో 4 బౌండరీలతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు ఉన్నాయి. 230 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఈ పించ్ హిట్టర్.. భారీ షాట్లే లక్ష్యంగా ఆడుతూ పోయాడు. బౌలర్లకు నరకం చూపించాడు. గుర్జన్‌ప్రీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈ ఆల్‌రౌండ్ 4 సిక్సులతో పాటు ఓ బౌండరీ బాదాడు. సింగిల్ రన్‌తో కలిపి మొత్తంగా ఒకే ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి. దీంతో తమిళనాడు విసిరిన 221 పరుగుల టార్గెట్‌కు చేరువగా వచ్చింది బరోడా. కానీ ఆఖరి ఓవర్ తొలి బంతికి పాండ్యా ఔట్ అయ్యాడు.
ఆఖర్లో ట్విస్ట్
హార్దిక్ నిష్క్రమణతో బరోడా గెలుస్తుందా? లేదా? అనే అనుమానం వచ్చింది. కానీ ఆఖర్లో అతిత్ (3 బంతుల్లో 7 పరుగులు) విన్నింగ్ షాట్‌తో పాండ్యా టీమ్ విజయం సాధించింది. చివరి బంతికి 4 పరుగులు అవసరమైన దశతో అతిత్ బౌండరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కాగా, తమిళనాడు బ్యాటింగ్ సమయంలో హార్దిక్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. 3 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో విజయ్ శంకర్ మూడు వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. అయితే బ్యాటింగ్‌లో చెలరేగిన హార్దిక్ టీమ్ సక్సెస్‌కు కారణమయ్యాడు. కాగా, మొదట పాండ్యా బౌలింగ్‌ను దంచికొట్టిన విజయ్ శంకర్.. ఆ తర్వాత అతడు మంచి ఊపు మీదున్న టైమ్‌లో రనౌట్ చేశాడు.
Also Read:
వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ
హార్దిక్ పాండ్యాను ఉతికి ఆరేసిన సీఎస్‌కే బ్యాటర్.. పిచ్చకొట్టుడు కొట్టాడు
సిరాజ్‌పై ప్రేమ చంపుకోని ఆర్సీబీ
For More Sports And Telugu News