Share News

Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్‌లో చోటు.. 100% సిద్ధమన్న దినేశ్ కార్తిక్

ABN , Publish Date - Apr 21 , 2024 | 12:47 PM

మరికొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న తరుణంలో.. ఒకవైపు భారత సెలక్టర్లు జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఆటగాళ్లు జట్టులో స్థానం పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్-2024లో (IPL 2024) ఉత్తమ ప్రదర్శన కనబరిచి..

Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్‌లో చోటు.. 100% సిద్ధమన్న దినేశ్ కార్తిక్
Dinesh Karthik Says Keen To Represent India Again

మరికొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ప్రారంభం కానున్న తరుణంలో.. ఒకవైపు భారత సెలక్టర్లు జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఆటగాళ్లు జట్టులో స్థానం పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్-2024లో (IPL 2024) ఉత్తమ ప్రదర్శన కనబరిచి.. సెలక్షన్ టీమ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్లేయర్ల జాబితాలో.. వెటరన్ వికెట్ కీపర్, ఆర్సీబీ (RCB) ప్లేయర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) కూడా ఉన్నాడు. ఈ సీజన్ ప్రారంభం అదరగొడుతున్న డీకే.. తానూ వరల్డ్‌కప్ రేసులో ఉన్నానని సెలక్టర్లకు సంకేతాలు పంపుతున్నాడు. డీకే ప్రదర్శన చూసి.. క్రీడాభిమానులతో పాటు కొందరు మాజీలు సైతం అతడ్ని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


కుండలోని నీరు తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఈ నేపథ్యంలోనే.. దినేశ్ కార్తిక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వరల్డ్‌కప్ ఆడేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు దశలో తనకు భారత్ తరఫున ఆడే అవకాశం లభిస్తే గొప్పగా భావిస్తానని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుతమున్న దశలో (39 ఏళ్ల వయసులో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అందుకు నేను కూడా 100 శాతం సంసిద్ధతతో ఉన్నాను. టీ20 ప్రపంచకప్‌‌లో భారత జట్టుకి ఆడటం కంటే.. నా జీవితంలో మరో పెద్ద విషయం ఏమీ లేదు. వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ఎంపిక చేసే ముగ్గురు సభ్యులు హెడ్‌కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, కెప్టెన్ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తులు. వాళ్లు ఉత్తమ జట్టునే ఎంపిక చేస్తారని నమ్మకం ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను కచ్ఛితంగా గౌరవిస్తా’’ అని కార్తిక్ చెప్పుకొచ్చాడు.

అవకాడో తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఎన్ని లాభాలంటే?

ఇదిలావుండగా.. ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మలలో ఎవరో ఒకరు భారత జట్టులో చోటు సంపాదించుకోవచ్చని అనుకున్నారు. కానీ.. ఐపీఎల్‌లో సంజూ శాంసన్, కేఎల్‌ రాహుల్, దినేశ్ కార్తిక్‌లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో.. వికెట్‌ కీపర్ బ్యాటర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. ముందంజలో రిషభ్ పంత్ ఉన్నాడు. అయితే.. అతనికి బ్యాకప్‌గా డీకేని ఎంపిక చేయాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి.. సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 01:09 PM