Share News

Glenn Maxwell: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన వరల్డ్‌కప్ డబుల్ సెంచరీ హీరో!

ABN , Publish Date - Jan 23 , 2024 | 01:17 PM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండా ఓ పార్టీకి హాజరైన మ్యాక్స్‌వెల్ పీకల దాకా తాగి ఆసుపత్రిపాలయ్యాడు. జనవరి 19న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న సిక్స్ అండ్ అవుడ్ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది.

Glenn Maxwell: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన వరల్డ్‌కప్ డబుల్ సెంచరీ హీరో!

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండా ఓ పార్టీకి హాజరైన మ్యాక్స్‌వెల్ పీకల దాకా తాగి ఆసుపత్రిపాలయ్యాడు. జనవరి 19న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న సిక్స్ అండ్ అవుడ్ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లేకుండానే మ్యాక్సీ ఈ పార్టీలో పాల్గొన్నాడు. పబ్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మ్యాక్స్‌వెల్ పీకలదాకా తాగాడు. చివరకు సోయిలేకుండా పబ్‌లోనే పడిపోయినట్లు సమాచారం. దీంతో అతడిని స్థానికంగా ఉన్న రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయింది. వెంటనే విచారణ కూడా ప్రారంభించింది.


కాగా ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్ మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్న మ్యాక్సీ జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్‌బోర్న్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కాగా వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా ఆడే వన్డే సిరీస్‌కు మ్యాక్స్‌వెల్‌ను ఎంపిక చేయలేదు. అయితే విండీస్‌తో టీ20 సిరీస్ దృష్యా అతడికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. అంతేకానీ పబ్ ఘటనకు, జట్టుకు ఎంపిక చేయకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో మ్యాక్స్‌వెల్ కీలకపాత్ర పోషించాడు. ఆల్‌రౌండరైన మ్యాక్స్‌వెల్ బ్యాటు, బంతితో సత్తా చాటాడు. ముఖ్యంగా లీగ్ దశలో అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో అజేయ డబుల్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 01:17 PM