Share News

T20 World Cup: కేఎల్ రాహుల్‌, రింకూలను అందుకే ఎంపిక చేయలేదు.. సెలక్టర్ వివరణ

ABN , Publish Date - May 02 , 2024 | 06:44 PM

టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...

T20 World Cup: కేఎల్ రాహుల్‌, రింకూలను అందుకే ఎంపిక చేయలేదు.. సెలక్టర్ వివరణ
Ajit Agarkar Reveals Why KL Rajul Rinku Dropped

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం బీసీసీఐ (BCCI) బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన రింకూ సింగ్‌ని (Rinku Singh), అలాగే ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న కేఎల్ రాహుల్‌ని (KL Rahul) సెలక్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించారు. ఆ ఇద్దరిని ఎందుకు జట్టులో తీసుకోలేదో క్లారిటీ ఇచ్చారు.


రాహుల్‌పై పాకిస్తాన్ ప్రశంసలు.. తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ

‘‘కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఓపెనింగ్ చేస్తున్నాడు. అయితే.. మేము ప్రధానంగా మిడిలార్డర్ కోసం చూస్తున్నాం. సంజూ శాంసన్ (Sanju Samson), రిషభ్ పంత్ (Rishabh Pant) అందుకు సరిగ్గా సరిపోతారని భావించి.. వాళ్లిద్దరిని ఎంపిక చేయడం జరిగింది. శాంసన్ అయితే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఇక్కడ బ్యాటింగ్ పొజిషన్‌ని దృష్టిలో ఉంచుకొని.. ఎవరు అవసరం అనేదే చూశాం తప్ప, ఎవరు బెటరని కాదు’’ అని అగార్కర్ వివరణ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన క్లాస్ ప్లేయర్ అని, అందులో ఏమాత్రం సందేహం లేదని తెలిపాడు. కానీ.. సంజూ, రిషభ్ పంత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారని తానను భావిస్తున్నానని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా వాళ్లిద్దరు మిడిలార్డర్‌కు పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చాడు.

భానుడి ప్రతాపం వేళ.. పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని..

అనంతరం రింకూ సింగ్ గురించి మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ అతడిని తాము ఎంపిక చేయలేకపోయామని అగార్కర్ తెలిపాడు. జట్టుకి మరో బౌలర్ అవసరం ఉండటంతో అతనికి జట్టులో స్థానం దక్కలేదని పేర్కొన్నాడు. రింకూ ఎంపిక అనేది ఎంతో కష్టమైందని, కానీ జట్టులో 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలమని అన్నాడు. ఏదేమైనా.. రింకూ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాడని, కాబట్టి అతను అందుబాటులోనే ఉంటాడని వెల్లడించాడు. పరిస్థితులు ఎప్పుడెలా మారుతాయో చెప్పలేమని చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన.. వరల్డ్‌కప్ సమీపించేలోపు జట్టులో రింకూకి చోటు దక్కే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 02 , 2024 | 06:44 PM