Share News

Happy Life: పెళ్లి తరువాత ఇవి పాటిస్తే మీ వైవాహిక జీవితం వండర్‌ఫుల్‌గా ఉంటుంది..!

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:53 AM

Wife and Husband Relationship: మీరు కొత్తగా పెళ్లైన జంటనా? కొత్తగా కాపురం ప్రారంభించనున్నారా? ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని భయాందోళనకు గురవుతున్నారా? అంత టెన్షన్ అవసరం లేదు. పెళ్లి(Marriage) తరువాత దంపతుల(Couple) మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగేందుకు.. జీవితం సంతోషంగా ఉండేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు(Family Counselor). ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ భాగస్వామితో..

Happy Life: పెళ్లి తరువాత ఇవి పాటిస్తే మీ వైవాహిక జీవితం వండర్‌ఫుల్‌గా ఉంటుంది..!
Wife and Husband Relation

Wife and Husband Relationship: మీరు కొత్తగా పెళ్లైన జంటనా? కొత్తగా కాపురం ప్రారంభించనున్నారా? ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని భయాందోళనకు గురవుతున్నారా? అంత టెన్షన్ అవసరం లేదు. పెళ్లి(Marriage) తరువాత దంపతుల(Couple) మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగేందుకు.. జీవితం సంతోషంగా ఉండేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు నిపుణులు(Family Counselor). ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు తమ భాగస్వామితో ఎలా ఉండాలో సూచిస్తున్నారు. మరి కొత్త దంపతుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

భాగస్వామిపై అధిక అంచనాలు..

మీరు మీ భాగస్వామిపై అంచనాలు కలిగి ఉండటంతో ఏమాత్రం తప్పు లేదు. అయితే, ఎక్కువ అంచనాలు పెట్టుకోవడమే అసంతృప్తి, అసహనానికి దారి తీస్తుంది. అందుకే.. దంపతులు ముందుగా ఒకరిపై ఒకరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు.

మాట్లాడాలి.. అర్థం చేసుకోవాలి..

కొత్తగా పెళ్లైన వారిలో చాలా మంది ఎక్కువగా మాట్లాడుకోరు. ముఖ్యంగా స్త్రీలు తమ భాగస్వామితో మాట్లాడేందుకు కాస్త సంకోచిస్తారు. ఈ కారణంగా తమ ఆలోచనలు పంచుకోలేరు. అలాంటి సందర్భంలో మాట్లాడకుండా ఎవరూ తమ తమ అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే.. ఒకరికొకరు ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ పంచుకోవాలి.

ఆధిపత్యం వద్దు..

వివాహ బంధంలో దంపతులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం చేస్తుంటారు. భర్త గానీ, భార్య గానీ తాము చెప్పిందే వినాలని పంతం పడుతుంటారు. దాంతో ఒకరు సైలెంట్ అయిపోతారు. ఇలా అస్సలు ఉండొద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని.. ఇద్దరూ తమను తాము సమానంగా చూసుకోవాలని చెబుతున్నారు.

అలాంటి వాటిని వదిలెయ్యడం ఉత్తమం..

దంపతులు జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు. రోజూ కలిసి ఉంటూ.. ప్రతి అంశంలో ఇద్దరూ భాగస్వాములవుతుంటారు. అయితే, ఏదో ఒక సమస్యపై గానీ.. సందర్భంలో గానీ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ బేదాభిప్రాయాలు ఘర్షణలకు దారి తీస్తాయి. అందుకే.. పరిష్కారం లేని అంశాలను, బేదాభిప్రాయాలను పట్టించుకోకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 10:53 AM