Share News

Trending News: విమానం వెనక తెల్లటి గీతలు.. ఇలా ఏర్పడడానికి కారణం మీకు తెలుసా..

ABN , Publish Date - Mar 13 , 2024 | 12:19 PM

సాధారణంగా ఏటా వివిధ రకాల విమానాల విన్యాసాలు జరుగుతుంటారు. రిపబ్లిక్ పరేడ్, నేవీ, ఆర్మీ వంటి యుద్ధ విమానాల మార్చ్ పాస్ట్ చేస్తుంటాయి. రివ్వుమంటూ ఆకాశంలో దూసుకెళ్తుంటాయి. అయితే.. ఆ సమయంలో విమానాల ( Plane ) వెనుక తెల్లటి పొగ కనిపిస్తుంది.

Trending News: విమానం వెనక తెల్లటి గీతలు.. ఇలా ఏర్పడడానికి కారణం మీకు తెలుసా..

సాధారణంగా ఏటా వివిధ రకాల విమానాల విన్యాసాలు జరుగుతుంటారు. రిపబ్లిక్ పరేడ్, నేవీ, ఆర్మీ వంటి యుద్ధ విమానాల మార్చ్ పాస్ట్ చేస్తుంటాయి. రివ్వుమంటూ ఆకాశంలో దూసుకెళ్తుంటాయి. అయితే.. ఆ సమయంలో విమానాల ( Plane ) వెనుక తెల్లటి పొగ కనిపిస్తుంది. ఇలా తెల్లటి పొగ చారలు ఎందుకు ఏర్పడతాయనే విషయంపై అనేక మంది అనేక రకాలుగా చెబుతుంటారు. ఇవన్నీ వాదనలే అయినప్పటికీ సరైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. యుద్ధ విమానాలు వాయు వేగంతో ఆకాశంలో వెళ్తున్నప్పుడు వాటి వెనుకగా తెల్లటి గీతలు ఏర్పడతాయి. నీలాకాశంలో తెల్లటి పొగ రావడానికి శాస్త్రీయమైన కారణమే ఉంది.

వాస్తవానికి విమానం వేగంగా వెళ్తున్న సయమంలో విమానం ఇంధనం నుంచి వేడి ఉత్పత్తవుతుంది. అంతే కాకుండా దాని వెనుకగా ఉండే గాలి వేడెక్కుతుంది. పైభాగంలో ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఫలితంగా చుట్టుపక్కల ఉండే చల్లని గాలి అక్కడి వేడి గాలితో కలిసి గడ్డకడుతుంది. ఇది ఒకటి, రెండు లేదా నాలుగు లైన్ల రూపంలో కనిపిస్తుంది. కొంత సమయం తరువాత ఉష్ణోగ్రత సాధారణమవుతుంది. దీంతో ఆ చారలు అదృశ్యమవుతాయి. వాతావరణంలో నీటి పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే చారలు కనిపించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.


యూనివర్శిటీ కార్పొరేషన్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ప్రకారం ఈ తెల్లని గీతలను కాంట్రయిల్స్ అంటారు. నీటి ఆవిరి ఘనీభవించినప్పుడు ఇవి కనిపిస్తాయి. విమానం అధిక వేగంతో ఎగురుతున్నప్పుడు సైలెన్సర్ వంటి వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంతే గానీ ప్రభుత్వాలు ప్రజలపై రసాయనాలు చల్లుతున్నాయనే ఆరోపణలు పూర్తి నిజం కాదు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం రసాయన దాడులు జరిపింది. ఆ సమయంలో అనేక మంది ప్రభావితమయ్యారు. ఆ భయమే ఇప్పటికీ కొనసాగుతుండటం కొసమెరుపు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 12:19 PM