Share News

Viral Video: జస్ట్ నీళ్లతో సింహాన్ని పరుగెత్తించిన ఏనుగు.. సీన్ మాత్రం నెక్ట్స్ లెవలే..!

ABN , Publish Date - Mar 19 , 2024 | 11:23 AM

Viral Video: సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలకు(Videos) కొదవే లేదు. ఏదైనా సోషల్ మీడియా(Social Media) యాప్ ఓపెన్ చేస్తే చాలు వీడియోలు వరుసగా వచ్చేస్తాయి. వీటిలో కొన్ని వీడియో మనసును హత్తుకుంటే.. మరికొన్ని లైట్ తీసుకుంటాం. ఇంకొన్ని వీడియోలను పదే పదే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో ఉండే కంటెంట్, సీన్స్ అలా ఉంటాయి మరి.

Viral Video: జస్ట్ నీళ్లతో సింహాన్ని పరుగెత్తించిన ఏనుగు.. సీన్ మాత్రం నెక్ట్స్ లెవలే..!
Elephant Scares Off Lion

Viral Video: సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలకు(Videos) కొదవే లేదు. ఏదైనా సోషల్ మీడియా(Social Media) యాప్ ఓపెన్ చేస్తే చాలు వీడియోలు వరుసగా వచ్చేస్తాయి. వీటిలో కొన్ని వీడియో మనసును హత్తుకుంటే.. మరికొన్ని లైట్ తీసుకుంటాం. ఇంకొన్ని వీడియోలను పదే పదే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో ఉండే కంటెంట్, సీన్స్ అలా ఉంటాయి మరి. తాజాగా ఓ యూట్యూబ్ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగు, సింహం మధ్య జరిగిన సన్నివేశం ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకోవడంతో పాటు.. సింహం, ఏనుగు బలాన్ని బేరీజు వేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ముందుగా తెలుసుకుందాం.

అడవిలో జంతువుల కోసం పలు చోట్ల నీటి కుంటలు ఏర్పాటు చేస్తుంటారు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ కూడా నీటి సంపులను ఏర్పాటు చేశారు. నీటి కోసం ఓ ఏనుగు వచ్చింది. అప్పటి ఆ సంపు పక్కన సింహం పడుకుని ఉంది. ఏనుగు రాకను గమనించిన సింహం.. నీటి సంపు పక్కన నక్కింది. ఏనుగు సైతం ఆ సింహాన్ని గమనించింది. భయం భయంతోనే నీటి వద్దకు వచ్చింది. ఆ భయంతోనే నీటిని తాగేసింది. చివరగా తన తొండంతో నీటిని పీల్చుకున్న ఏనుగు.. ఆ నీటిని సింహాన్ని బెదిరించేందుకు ఉపయోగించింది. నీటిని సింహం మీదకు చల్లింది. దాంతో బెదిరిపోయిన సింహం.. అక్కడి నుంచి పరుగులు తీసింది. సింహం పారిపోవడంతో కాస్త ధైర్యం తెచ్చుకున్న ఏనుగు.. తానే తోపు అన్నట్లుగా సింహం వెంటపడి బెదిరించే ప్రయత్నం చేసింది. చివరకు సింహం చెట్లలోకి వెళ్లిపోగా.. ఏనుగు వెనక్కి తిరిగి వచ్చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 11:23 AM