Share News

Viral Video: కరాటే ఫైటర్ వర్సెస్ స్ట్రీట్ ఫైటర్.. మైండ్ బ్లాంక్ ఫైటింగ్..

ABN , Publish Date - May 02 , 2024 | 06:15 PM

Watch Video: మందుబాబులు ఒక 90 వేస్తే.. కళ్ల ముందు కరాటే మాస్టర్ ఉన్నా.. కుంగ్‌ఫూ ఎక్స్‌పర్ట్ ఉన్నా సరే.. ఎవడైతే నాకేంటి బ్రో.. అంటూ కదనరంగంలోకి దూకేస్తారు. అప్పటి వరకు తమకు రాని, అసలు వాడుకలో లేని, ఇప్పటి వరకు చూడని వింత వింత కళలలను కూడా మందుబాబులు చూపించేస్తారు. ఇది మందుబాబులు మత్తులో..

Viral Video: కరాటే ఫైటర్ వర్సెస్ స్ట్రీట్ ఫైటర్.. మైండ్ బ్లాంక్ ఫైటింగ్..
Viral Video

Watch Video: మందుబాబులు ఒక 90 వేస్తే.. కళ్ల ముందు కరాటే(Karate) మాస్టర్ ఉన్నా.. కుంగ్‌ఫూ(Kung fu) ఎక్స్‌పర్ట్ ఉన్నా సరే.. ఎవడైతే నాకేంటి బ్రో.. అంటూ కదనరంగంలోకి దూకేస్తారు. అప్పటి వరకు తమకు రాని, అసలు వాడుకలో లేని, ఇప్పటి వరకు చూడని వింత వింత కళలలను కూడా మందుబాబులు చూపించేస్తారు. ఇది మందుబాబులు మత్తులో ఉండి చేస్తారు. కానీ, కొందరు పోరగాళ్లు ఉంటారు.. తామే తోపులం అని కాలర్ ఎగరేస్తారు. ఎదుట ఉన్న వారి బలాబలాలు, టెక్నిక్స్‌ని ఏమాత్రం అంచనా వేయకుండా.. ఛల్ నడువ్ దమ్ముంటే చూసుకుందాం పదా అంటూ పోటీకి వస్తారు. చివరకు బోల్తా పడిపోతారు. తాజాగా అలాంటి ఫన్నీ, ఆలోచనాత్మక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ స్ట్రీట్ ఫైటర్.. కరాటే శిక్షణ పొందిన వ్యక్తితో ఫైటింగ్‌కు దిగాడు. పెద్ద తోపులెక్క ముందుకు వెనక్కి కాళ్లు ఆడిస్తూ, చేతులు ఊపుతూ కరాటే ట్రైనర్‌ను కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, అక్కడే పెద్ద ఝలక్ ఇచ్చాడు ప్రత్యర్థి. తొలుత తనను తాను డిఫెన్స్ చేసుకున్న కరాటే ట్రైనర్.. ఆ తరువాత సీన్‌లో మాత్రం మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చాడు. తలపై ఒకే ఒక్క లెగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో బిత్తరపోయి కిందపడిపోయాడు స్ట్రీట్ ఫైటర్. ఉలుకు పలుకు లేకపోవడంతో కంగారు పడిన కరాటే విద్యార్థులు.. వెంటనే అతన్ని లేపే ప్రయత్నం చేశారు. స్ట్రీట్ ఫైటర్‌ను లేపి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.


ఈ ఫైటింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అందుకు అంటారు పెద్దలు.. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.. ఎవరి శక్తి ఏంటో గ్రహించి.. సమానులైన వారితో తలపడాలని సూచిస్తారు.’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

For More Trending News and Telugu News..

Updated Date - May 02 , 2024 | 06:15 PM