Share News

Can You Guess: ఈ ముగ్గురిలో ప్రాణాలతో లేని వ్యక్తి ఎవరో చెప్పగలరా.. ?

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:05 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వైరల్ వీడియోలతో పాటూ ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోలు తదితరాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని అందిస్తే.. మరికొన్ని విజ్ఞానాన్ని అందిస్తుంటాయి. అలాగే...

Can You Guess: ఈ ముగ్గురిలో ప్రాణాలతో లేని వ్యక్తి ఎవరో చెప్పగలరా.. ?

సోషల్ మీడియాలో నిత్యం అనేక వైరల్ వీడియోలతో పాటూ ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోలు తదితరాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని అందిస్తే.. మరికొన్ని విజ్ఞానాన్ని అందిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని విజ్ఞానంతో పాటూ మెదడుకు మేతలా ఉపయోగపడుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఆసక్తికర ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోలో ముగ్గురు వ్యక్తులు పడుకుని ఉన్నారు. అయితే వారిలో ఓ బాలుడు ప్రాణాలతో లేడు. అతనెవరో కనుక్కునేందుకు ట్రై చేయండి..

సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photos) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు వ్యక్తులు బీచ్ వద్ద పడుకుని ఉన్నట్లు ఫొటోలో చూడవచ్చు. వారిలో A అనే వ్యక్తి నీటిలో పడుకుని, తేలియాడుతూ ఉన్నాడు. అతడి కాళ్లు నీటిలో ఉండగా.. శరీరం, తల మాత్రం పైకి తేలుతూ ఉన్నాయి. అలాగే B అనే వ్యక్తి నీటి ఒడ్డున కళ్లద్దాలు పెట్టుకుని పడుకుని ఉన్నాడు. అతడి కాళ్లు నీటిలో ఉంచి, ఓ చేయిని తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అదేవిధంగా C అనే వ్యక్తి నీటిలో రబ్బరు ట్యూబ్‌పై పడుకున్నాడు. మరో వైపు ఓ చేత్తో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నాడు. అయితే వీరిలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో లేడు. అతడు ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నించండి. అది కష్టం అయినా కాస్త తీక్షణంగా చూస్తే మాత్రం ఈజీగా గుర్తించవచ్చు.

Viral: పూలతో నిండిన అంబులెన్స్‌.. ఊరేగింపుగా ఊర్లోకి రావడంతో అంతా షాక్.. చివరకు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం తెలిసి..

optical.jpg

సమాధానం విషయానికొస్తే, అక్కడ పడుకున్న ముగ్గురిలో మొదట A అనే వ్యక్తిని గమనిస్తే.. అతను నీటిపై తేలియాడుతూ ఉన్నాడు. అంటే అతను ప్రాణాలతో ఉన్నాడని అర్థం. అలాగే C అనే వ్యక్తి కూడా ట్యూబ్‌పై పడుకుని ఓ చేత్తో పుస్తకాన్ని పట్టుకున్నాడు. దీంతో అతను కూడా ప్రాణాలతో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇక B అనే వ్యక్తి ఎలాంటి కదలిక లేకుండా పడుకున్నాడు. కాబట్టి ఆ ముగ్గురిలో B అనే వ్యక్తి చనిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు.

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

Updated Date - Mar 29 , 2024 | 07:28 PM