Share News

Battle of Baghpat: 3 ఏళ్ల క్రితం దేశంలో జరిగిన ఈ మహా యుద్ధం గుర్తుందా?

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:44 PM

మూడేళ్ల క్రితం జరిగిన ఓ తగదా ఆ తరువాత భాగ్‌పత్ యుద్ధంగా నెట్టింట ప్రాచుర్యం పొందింది. ఈ గొడవ జరిగి మూడేళ్లు కావస్తుండటంతో వీడియో మరోసారి వైరల్‌గా మారింది.

Battle of Baghpat: 3 ఏళ్ల క్రితం దేశంలో జరిగిన ఈ మహా యుద్ధం గుర్తుందా?

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో 2021లో ఓ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తాలూకు వీడియో నెట్టింట పెను సంచలనమే సృష్టించింది. యావత్ దేశం ఆ సంగ్రామాన్ని చూసి కలవరపడింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ యుద్ధం జరిగి నేటికి మూడేళ్లు! దీంతో, నెటిజన్లు మరోసారి నాటి వీడియోను వైరల్ (Viral) చేస్తున్నారు. అదేంటి..అంత పెద్ద యుద్ధం ఎప్పుడు జరిగిందంటారా? అయితే, భాగ్‌పత్ యుద్ధం (Battle of Baghpat) గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

China Lottery: ఒకేసారి 133 టిక్కెట్లకు బంపర్ లాటరీ.. ఈ యువకుడు ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే..


ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) ఓ చిన్న ప్రాంతంలో ఆ ‘యుద్ధం’ జరిగింది. వాస్తవానికి ఇది ఇరు వర్గాల మధ్య గొడవే అయినా నెటిజన్లు మాత్రం దానికి మహా సంగ్రామమని పేరు పెట్టారు. ఆ రోజున రెండు చాట్ షాపుల వాళ్ల మధ్య మొదలైన తగవు అకస్మాత్తుగా తీవ్ర రూపం దాల్చింది (Fight between Chaatshop owners). ఇరు వర్గాలు వారు కర్రలతో తెగ బాదేసుకున్నారు. అయితే, ఈ యుద్ధంలో ఓ కురు వృద్ధుడి పేరు మాత్రం మారుమోగిపోయింది. గుబురు జుట్టు ఉన్న అతడిని ఉత్తరాది వాళ్లు ఐన్‌స్టీన్ బాబాయ్ (Einstein Chacha) అని పేరుపెట్టుకున్నారు. అంటే, ఐన్‌స్టీన్‌లా అతడి జుట్టు రింగులు తిరిగి ఉంటుందన్నమాట. కాగా, అప్పట్లో గొడవ పడ్డ వాళ్లల్లో కొందరిపై హత్య కేసు కూడా నమోదు కావడం గమనార్హం.

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..


ఆ తరువాత వాళ్లల్లో చాలా మంది బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఐన్‌స్టీన్ బాబాయ్ కూడా తన ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్‌ను వదిలించుకుని సింపుల్‌గా మారిపోయారు. ఇటీవలే అతడు పాత లుక్‌లోకి వచ్చేశాడు. ఎందుకిలా అంటే..జనాల కోరిక మేరకు పాత స్టైల్‌లోకి మారిపోయానని అతడు సెలవిచ్చాడు. అయితే, నాటి దృశ్యాల్ని అస్సలు మర్చిపోని నెటిజన్లు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతూ వీడియోను వైరల్ చేస్తుంటారు. మరి ఆ వీడియోను చూడని వాళ్లు ఓ లుక్కేయండి !

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..

Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్‌ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 08:50 PM