Share News

China Lottery: ఒకేసారి 133 టిక్కెట్లకు బంపర్ లాటరీ.. ఈ యువకుడు ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే..

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:10 PM

చైనాకు చెందిన ఓ యువకుడు ఒకేసారి 133 టిక్కెట్లపై బంపర్ లాటరీ దక్కించుకున్నాడు. యావత్ దేశంలోనే అత్యధిక మొత్తం లాటరీలో గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

China Lottery: ఒకేసారి 133 టిక్కెట్లకు బంపర్ లాటరీ.. ఈ యువకుడు ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ యువకుడు ఒకేసారి 133 టిక్కెట్లపై బంపర్ లాటరీ (China's lottery) దక్కించుకున్నాడు. యావత్ దేశంలోనే అత్యధిక మొత్తం లాటరీలో గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు (Country highest lottery) . గ్విజో ప్రావిన్స్‌కు చెందిన యువకుడిని ఈ అరుదైన అదృష్టం వరించింది. ఫిబ్రవరి 7న అతడు రూ.799 కోట్ల రూపాయల చెక్కును అందుకున్నాడు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ప్రస్తుతం చైనాలోనే కాకుండా ప్రపంచమంతటా వైరల్‌గా (Viral) మారింది.

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..


ఇంతటి ధనరాశిని సొంతం చేసుకున్న అతడి వయసు జస్ట్ 28 ఏళ్లు. గ్విజో ప్రావిన్స్‌లో ఓ చిన్న షాపు నిర్వహిస్తుంటాడు. చాలా కాలంగా అతడు లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెంబర్లకు తరచూ లాటరీ తగులుతున్న విషయాన్ని అతడు గుర్తించాడు. ఆ నెంబర్లకు తన అదృష్ట అంకెను కూడా జోడించి మొత్తం 7 అంకెలను ఎంచుకున్నాడు. కొన్నాళ్లుగా అవే అంకెలున్న టిక్కెట్లు కొంటున్నాడు. ఇటీవల కూడా అవే అంకెలున్న మొత్తం 133 టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే, ఈసారి యువకుడి అంచనాలు అసాధారణ రీతిలో నిజమైయ్యాయి.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..


అతడు కొన్న ప్రతి టిక్కెట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఒక్కో లాటరీ పైనా సుమారు రూ.6 కోట్లు గెలుచుకున్న అతడు మొత్తంగా రూ.799 కోట్లు దక్కించుకున్నాడు. అయితే, ఇందులో పావు శాతం పన్ను కింద పోగా మిగిలిన మొత్తాన్ని అతడు చెక్కు రూపంలో తీసుకున్నాడు. తనకు లాటరీ దక్కిన విషయం కంపెనీ వారు చెప్పగానే నమ్మలేకపోయానని అతడు చెప్పాడు. ఆ రాత్రంతా తనకు నిద్రేపట్టలేదన్నాడు. ఈ డబ్బుతో తన జీవితాన్ని నచ్చినట్టు నిర్మించుకుంటానని స్థానిక మీడియాకు తెలిపాడు.

Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్‌ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 08:15 PM