Share News

Viral Video: పైసా ఖర్చు లేదు.. లక్షలు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా!

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:01 PM

Viral Video: కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇది సినిమా డైలాగ్ అయినా.. నిజ జీవితానికి(Lifestyle) సరిగ్గా సరిపోలుతుంది. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. ఏపని చేసినా కడుపు నింపుకోవడానికే. అయితే, కొందరు కష్టపడి, ఒళ్లు వంచి పని చేస్తే.. మరికొందరు తమ బుర్రకు పదునుపెట్టి స్మార్ట్ వర్క్‌తో(Smart Work) భారీగా సంపాదిస్తారు. అలాంటి వారిదే సమాజంలో ..

Viral Video: పైసా ఖర్చు లేదు.. లక్షలు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా!
Viral Video

Viral Video: కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇది సినిమా డైలాగ్ అయినా.. నిజ జీవితానికి(Lifestyle) సరిగ్గా సరిపోలుతుంది. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. ఏపని చేసినా కడుపు నింపుకోవడానికే. అయితే, కొందరు కష్టపడి, ఒళ్లు వంచి పని చేస్తే.. మరికొందరు తమ బుర్రకు పదునుపెట్టి స్మార్ట్ వర్క్‌తో(Smart Work) భారీగా సంపాదిస్తారు. అలాంటి వారిదే సమాజంలో పైచేయి ఉంటుంది.

చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించాలని భావిస్తుంటారు. కానీ, అందరికీ ఆ తెలివి, ఆ ఐడియాస్ రావు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం మీకు తప్పకుండా బిజినెస్ ఐడియా వస్తుంది. అవును మరి.. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు చేస్తున్న బిజినెస్ అలా ఉంది. వారి బిజినెస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.

పైసా ఖర్చు లేని బిజినెస్.. రెండు చేతులా సంపాదన..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు పైసా ఖర్చు లేకుండా రెండు చేతులా సంపాదించేస్తున్నారు. రోడ్డు పక్కన డివైడర్ వద్ద అవతలి వాళ్లను ఇవతలికి.. ఇవతలి వాళ్లను అవతలికి పంపించడమే వారి బిజినెస్. రోడ్డుపై ఉన్న డివైడర్ దాదాపు ఒక మనిషి ఎత్తు ఉంది. ఆ డివైడర్‌కు ఎక్కడా యూటర్న్ ఆప్షన్ కూడా లేదు. ప్రయాణికులు రోడ్డు దాటి ఇవతలి వైపు రావాలంటే దాదాపు కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సి ఉంటుంది. దీన్ని తమ బిజినెస్‌కు ఉపయోగించుకున్నారు కొందరు వ్యక్తులు. డివైడర్‌కు అవతలివైపు, ఇవతలివైపు రెండు నిచ్చెనలు వేసి ప్రయాణికులకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. దీనిని ఉపయోగించుకోవాలంటే ప్రజలు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రయాణికులు, పాదాచారుల వద్ద నుంచి డబ్బు తీసుకుని రెండు చేతులా సంపాదించేస్తున్నారు వీరు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వాట్ ఏ బిజినెస్ ఐడియా గురూజీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పైసా ఖర్చు లేని.. జేబు నిండా సంపాదించే బిజినెస్ అని పేర్కొంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 12:01 PM