Optical Illusion: దొంగ పిల్లి.. నక్కి నక్కి దాక్కుంది.. కనిపెట్టే సత్తా మీలో ఉందా?
ABN , Publish Date - May 04 , 2024 | 04:26 PM
Optical Illusion Eye Test: హాట్ హాట్ సమ్మర్లో.. మిమ్మల్ని కూల్ చేసే ఫజిల్‌ను(Puzzle) ఒకటి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇంటర్నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫజిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్స్(Optical Illusion) మరింత ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలకు కాలక్షేపంగానే కాకుండా.. వారి కంటి చూపును, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు..
Optical Illusion Eye Test: హాట్ హాట్ సమ్మర్లో.. మిమ్మల్ని కూల్ చేసే ఫజిల్‌ను(Puzzle) ఒకటి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇంటర్నెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫజిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్స్(Optical Illusion) మరింత ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలకు కాలక్షేపంగానే కాకుండా.. వారి కంటి చూపును, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అందుకే.. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్కి నెటిజన్ల నుంచి యమ క్రేజ్ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ హైడ్ అండ్ సీక్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఒక పిల్లి దాక్కుని ఉంది. ఆ దాగి ఉన్న పిల్లిని కనిపెట్టడమే మీముందు ఉన్న టాస్క్. సరిగ్గా చూస్తే ఆ పిల్లిని కనిపెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే, ఇందుకోసం మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దృష్టిని కేంద్రీకరించి.. పరిశీలనాత్మకంగా చూడాలి. అప్పుడు గానీ ఆ పిల్లిని కనిపెట్టడం సాధ్యపడదు.
బ్యాక్ యార్డ్‌లో దాక్కున్న పిల్లి..
వైరల్ అవుతున్న పిక్‌లో రాళ్లతో నిర్మించిన ఇళ్లు/గోడౌన్ ఉంది. దీనికి భారీ తలుపు, ఆ డోర్‌కి బయటివైపున గార్డెన్ మాదిరిగా గడ్డి, చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు ఉన్నాయి. ఆ గడ్డి పొదల మధ్య పిల్లి దాక్కుని ఉంది. ఆ దాక్కున్న పిల్లిని మీరు కనిపెట్టాలి. అదే మీ ముందున్న టాస్క్. కొంచె క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఆ పిల్లిని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఫోటోలో దాక్కున్న పిల్లిని పసిగట్టేయండి. మీ బ్రెయిన్ పనితీరును, కంటి చూపును మెరుగుపరుచుకోండి.
ఏంటి ఇంకా ఆ పిల్లి కనిపించలేదా?
ఎంత వెతికినా ఆ పిల్లి కనిపించలేదా? మరేం పర్వాలేదు. పిల్లి ఎక్కడుందో కింద ఫోటోలో మార్క్ చేసి చూపించాం. అందులో ఆ హిడెన్ క్యాట్‌ను చూసేయండి.