Share News

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:53 AM

బ్యూటీ సెలూన్ లో కెరాటిన్ ట్రీట్మెంట్ కు బోలెడు డబ్బు ఖర్చవుతుంది. పైగా వీటిలో రసాయనాలు వాడతారు. అలా కాకుండా ఇంట్లోనే మిగిలిపోయిన అన్నంతో కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు.

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!

అందంలో కేశ సంరక్షణ కూడా ప్రధాన భాగం. కానీ చాలామంది అమ్మాయిలు ముఖ సౌందర్యం కోసం వెళ్లినట్టు కేశ సంరక్షణ కోసం బ్యూటీ సెలూన్ కు వెళ్లరు. బ్యూటీ సెలూన్ లో కెరాటిన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది బాగా పొడిగా టెంకాయ పీచులా ఉన్న జుట్టును, హెయిర్ ఫాల్ ను,జుట్టు చివర్లు చిట్లడాన్ని, జుట్టుకు షైనింగ్ ను ఇస్తుంది. మరీ ముఖ్యంగా జుట్టు స్ట్రైట్ గా అందంగా కనిపిస్తుంది. అయితే బ్యూటీ సెలూన్ లో కెరాటిన్ ట్రీట్మెంట్ కు బోలెడు డబ్బు ఖర్చవుతుంది. పైగా వీటిలో రసాయనాలు వాడతారు. అలా కాకుండా ఇంట్లోనే మిగిలిపోయిన అన్నంతో కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. అదెలాగో తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

మిగిలిపోయిన అన్నం.. 1కప్పు

గుడ్డులో తెల్లసొన.. 1

కొబ్బరి నూనె.. 1.5 స్పూన్

ఆలివ్ నూనె.. 1 టీ స్పూన్

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


తయారుచేసే పద్దతి..

ఒక గిన్నెలో మిగిలిపోయిన అన్నం తీసుకుని బాగా మెత్తగా, పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా అయిన అన్నంలో గుడ్డులోని తెల్లసొన వేయాలి. తరువాత ఆాలివ్ నూనె, కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. దీన్ని మిక్సీలో వేసి స్మూత్ గా ఉండేలా గ్రైండ్ చేయవచ్చు. అంతే.. కెరాటిన్ ట్రీట్మెంట్ మిశ్రమం తయారైనట్టే..

ఎలా వాడాలి..

తయారుచేసుకున్న కెరాటిన్ పేస్ట్ ను వేళ్లతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. దీన్ని అప్లై చేసిన తరువాత ఒక గంట సేపు దాన్ని అలాగే ఉంచి ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వాడుతుంటే అద్భుతమైన ఫలితాలుంటాయి.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!


ఎలా పనిచేస్తుందంటే..

నిజానికి ఈ కెరాటిన్ ట్రీట్మెంట్.. కొరియన్ల కేశ సంరక్షణలో భాగం. కొరియన్లు తమ అందం, కేశ సంరక్షణలో బియ్యాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అందుకే వారి జుట్టులోనూ, చర్మంలోనూ చెప్పలేని గ్లో కనిపిస్తూ ఉంటుంది. బియ్యంలో విటమిన్ బి, విటమిన్ ఇ, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 23 , 2024 | 09:53 AM