ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!

నీరు.. ప్రతిరోజూ కనీసం 2గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు తెస్తుంది.

దోసకాయ.. దోసకాయలలో నీటిశాతం ఎక్కువ.  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. లోపలి నుండి శరీరాన్ని చల్లబరిచి చర్మానికి మెరుపు ఇస్తుంది.

స్ర్కబ్.. వేసవిలో స్కిన్ ట్యాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యంపిండి, కాఫీ వంటి పదార్థాలతో స్క్రబ్ చేసుకోవాలి. చర్మానికి మెరుపు వస్తుంది.

హోం టిప్స్.. ముఖం అందంగా కనిపించడానికి ఇంటి చిట్కాలు పాటించేట్లు అయితే పెసరపప్పు, ముల్తానీ మట్టి, శనగపిండి, పసుపు వంటివి వాడాలి. ఇవి చర్మానికి మంచివి.

కలబంద.. తాజా కలబంద జెల్ ను ముఖానికి రాసి 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

ఆహారం.. నీరు అధికంగా ఉన్న పండ్లు, సిట్రస్ పండ్లు,  యాంటీ ఏజింగ్ కు దోహదం చేసే పండ్లు తీసుకోవాలి. నూనె ఆహారాలు, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు నివారించాలి. 

జాగ్రత్తలు.. బయట నుండి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ఉపయోగించడం,  ముఖ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖానికి రోజ్ వాటర్, మాయిశ్చరైజర్ వంటివి ఉపయోగించడం ఫాలో అవ్వాలి.