ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

తీపి పదార్థాలలో బెల్లం ఆరోగ్యమైనదిగా పరిగణింపబడుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

బెల్లంలో కాల్షియం, జింక్ సహా అనేక పోషకాలు ఉంటాయి.

ఉదయాన్నే పరగడుపున బెల్లం నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

బెల్లంలో ఐరన్ పుష్కంగా ఉంటుంది.  ఇది రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.

బెల్లంలో విటమిన్-సి, మెగ్నీషియం, విటమిన్-బి6 ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

బెల్లం నీరు శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుద్ది చేస్తుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే బెల్లం నీరు తాగితే నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది.