Share News

Viral: అనేక అనుమానాలతో ఢిల్లీ మెట్రో ఎక్కిన విదేశీ యువతి.. చివరకు అక్కడి సీన్ చూసి..

ABN , Publish Date - May 26 , 2024 | 10:10 PM

ఢిల్లీ మెట్రోను ప్రశంసిస్తూ ఓ ఐర్లాండ్‌ యువతి ఆమె బాయ్ ఫ్రెండ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: అనేక అనుమానాలతో ఢిల్లీ మెట్రో ఎక్కిన విదేశీ యువతి.. చివరకు అక్కడి సీన్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రోను ప్రశంసిస్తూ ఓ ఐర్లాండ్‌ యువతి ఆమె బాయ్ ఫ్రెండ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. సాధారణంగా విదేశీ ప్రజరవాణా సాధనాల్లో ప్రయాణించడమంటే టూరిస్టులు ఎవరైనా కాస్తంత ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇసాబెల్, కోలిన్ ఫినెర్టీ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. పైపెచ్చు నెట్టింట ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుని కాస్తంత ఆందోళనకు గురయ్యారు. కానీ స్టేషన్ లో ఒక్కసారి కాలుపెట్టాక వారి అనుమానాలన్నీ తొలగిపోయాయి.

మెట్రోలో ప్రయాణించిన వారు తాము ఇంతకు మించి శుభ్రమైన, చవకైన, సురక్షితమైన మెట్రోను చూడలేదని చెప్పారు. టిక్కెట్టు ధర కూడా అందుబాటులో ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. మెట్రో కారణంగా నగర ట్రాఫిక్ ను తప్పించుకోవడమే కాకుండా ఢిల్లీ అంతా అతి తక్కువ ఖర్చుతో చుట్టి వచ్చామని అన్నారు. ఆటో వాలాలలో చార్జీల గురించి వాదన పెట్టుకోవాల్సిన పని తప్పిందని వ్యాఖ్యానించారు (Irish vloggers praise smooth safe clean Delhi Metro in viral video).

Silence: లైఫ్‌లో ఈ సందర్భాలు ఎదురైతే నోరు తెరవొద్దు.. మౌనమే శ్రీరామ రక్ష!


అయితే, టిక్కెట్ వెండింగ్ మెషీన్ లు విదేశీ క్రెడిట్ డెబిట్ కార్డులను స్వీకరించట్లేదని చెప్పారు. అందుకే తాము డబ్బు పెట్టి టిక్కెట్ కొన్నామని చెప్పారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణం తరువాత తమ అనుమానాలన్నీ తీరిపోయాయని చెప్పారు. అసలు ఇలాంటి అద్భుత పరిస్థితి ఎదురవుతుందని తాము అస్సలు ఊహించలేదని అన్నారు. దాదాపు ఐదు నెలల పాటు ఇండియాలో ఉన్నామని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. భారత్ ఎంతో భద్రమైదని, అనవసర అనుమానాలు పెట్టుకోకుండా భారత్ సందర్శించాలని చెప్పారు.

ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అనేక మంది ఆ జంటపై ప్రశంసలు కురిపించారు. అనేక మంది విదేశీయులు తమ వీడియోల్లో భారత్ ను విమర్శిస్తుంటే అందుకు భిన్నంగా నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read Viral and Telugu News

Updated Date - May 26 , 2024 | 10:21 PM