Share News

Silence: లైఫ్‌లో ఈ సందర్భాలు ఎదురైతే నోరు తెరవొద్దు.. మౌనమే శ్రీరామ రక్ష!

ABN , Publish Date - May 25 , 2024 | 10:06 PM

జీవితంలో ఎదురయ్యే అనేక సందర్భాల్లో మాటలకంటే మౌనం ద్వారానే ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి, అనవసరంగా మాటలకు దిగకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే మంచిదని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Silence: లైఫ్‌లో ఈ సందర్భాలు ఎదురైతే నోరు తెరవొద్దు.. మౌనమే శ్రీరామ రక్ష!

ఇంటర్నెట్ డెస్క్: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు అంటారు. అయితే, మాటతో పాటూ మౌనానికీ అంతే ప్రాధాన్యం ఉంది. ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు మౌనాన్ని ఆశ్రయించాలో తెలిసున్న వాళ్లు అనేక సమస్యలను సులువుగా అధిగమించగలరు. కాబట్టి, కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా ఉంటేనే మంచిది. మరి అవేంటో ఓసారి చూద్దాం..

చాలా సందర్భాల్లో మనకు సమస్య లేదా సందర్భంపై పూర్తి అవగాహన ఉండదు. ఇలాంటి సందర్భాల్లో తొందరపాటుతో ముందుస్తు అంచనాలకు రావడం, తెలిసీ తెలీకుండా నోటికొచ్చినట్టు మాట్లాడం చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో మౌనంతో రాబోయే ప్రమాదాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు (Power of Silence).

Viral: ఆమెకు 102 ఏళ్లు.. ఆయనకు 100 ఏళ్లు.. ఓల్డేజ్ హోంలో వివాహం

తీవ్ర ఆగ్రహంతో ఉన్నప్పుడు మాట తూలే ప్రమాదం ఉంది. ఇది అవతలి వారి మనసుల్ని గాయపరచొచ్చు. బంధాల్ని శాశ్వతంగా తెంపేయొచ్చు. కాబట్టి, ఆగ్రహం కట్టలు తెంచుకున్న సమయంలో సంయమనం పాటించాలి. మనసుకు తోచింది అస్సలు మాట్లాడకూడదు. ఇలాంటి సందర్భాల్లో మౌనం, స్వీయనియంత్రణ అత్యంత కీలకం. కొన్ని క్షణాలు మనల్ని మనం నిగ్రహించుకుని మౌనం పాటిస్తే తీవ్ర భావోద్వేగాలు సద్దుమణుగుతాయి. తద్వారా పరిస్థితులు చేయి దాటకుండా నివారించవచ్చు (You Should Choose To Be Absolutely Silent In Life in these situations).


మనుషుల మధ్య బంధాలు తెగిపోయేందుకు క్షణకాలం పట్టదు. ఒక్కమాటతో సుదర్ఘీకాలం ఉన్న బాంధవ్యం కూడా క్షణాల్లో తెగిపోవచ్చు. కాబట్టి, బేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మౌనాన్నే ఆశ్రయించాలి. అవతలి వారి వాదన ఎంత అసంబద్ధంగా ఉన్నా గాయపరిచేలా మాటతూలొద్దు. దీంతో, పరస్పరం నమ్మకం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇది బంధం మరింత బలపడేలా చేస్తుంది. స్నేహం, వ్యాపార సంబంధాలు, భాగస్వామితో బంధం వరకూ అన్ని సందర్బాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది.

ఎవరైనా బాధల్లో ఉన్నన్నప్పుడు సాంత్వన చేకూర్చే మాటలు మాట్లాడి ఓదార్చాలని అనిపిస్తుంది. ఇందులో తప్పులేదు. కానీ కొన్ని బాధలకు మాటలతో ఉపశమనం లభించదు. వీటికి కాలమే పరిష్కారం చెప్పాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అవతలి వారికి మన మౌనమే సాంత్వన చేకూరుస్తుందన్న విషయం మర్చిపోకూడదు.

Read Viral and Telugu News

Updated Date - May 25 , 2024 | 10:11 PM